తమిళ దర్శకుడు శంకర్ కమల్ హాసన్ ( Shankar ,Kamal Haasan )కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని తెచ్చుకుంది.
మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటావ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్ లకు క్యూ కడుతున్నారు.ఇక సినిమా చూసిన ప్రేక్షకులు కమల్ హాసన్ నటన, సిద్దార్థ్ ఫర్మామెన్స్ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
కొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా వీక్షించిన బిగ్బాస్ ఫేమ్ భోలే షావలి ఆసక్తికర కామెంట్స్ చేశారు.భారతీయుడు 2( Indian 2 ) మూవీతో సిద్ధార్థ్ జన్మ ధన్యమైపోయిందని అన్నారు.ఈ సందర్బంగా భోలే షావలి ( Bhole Shawali )మాట్లాడుతూ.
ఈ సినిమాతో సిద్ధార్ధ్ జన్మ ధన్యమైపోయింది.నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను.
సినిమా చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను.కళ్లు తుడుచుకుంటూనే సినిమా చూశాను.
ఇక్కడ ఇండియన్-3 గురించి చిన్న హింట్ ఇచ్చారు.స్వాతంత్ర్య పోరాటం మళ్లీ మన కళ్ల ముందు కనిపించేలా ఉండనుంది అంటూ ప్రశంసలు కురిపించారు.
కాగా 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్గా ఇండియన్ 2 తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.ఈరోజు రేపు వీకెండ్ కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడతారని కలెక్షన్ లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్ లను రాబడుతుందో చూడాలి మరి.