TDP Chandrababu : ఆ పోరాటానికి దిగబోతున్న టీడీపీ ?  'ఇదేం కర్మ ' ! 

ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో ఎప్పుడు ముందే ఉంటుంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం.2024 ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి రావాలని , లేకపోతే పార్టీ మనుగడే కష్టం అవుతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.

అందుకే పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమం ద్వారా యాక్టివ్ చేస్తూ ప్రభుత్వంపై పోరాటం చేపట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారు.

పార్టీ శ్రేణులు నిత్యం జనాల్లో ఉంటూ, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పోరాటం చేయడం ద్వారా టిడిపికి మరింత ఆదరణ పెరుగుతుందని,  2024 ఎన్నికల్లో అవే తమను అధికారంలోకి తీసుకొస్తాయని బాబు భావిస్తున్నారు.వైసిపి ప్రభుత్వం పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.    గతంలో వైసిపి ప్రభుత్వం ధరల పెంపుదల చేపట్టడంపై వినూత్నంగా బాదుడే బాదుడు కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు.

అలాగే మినీ మహానాడు విజయవంతంగా నిర్వహించడం, ఆ తర్వాత జిల్లాలు, నియోజకవర్గాల వారీగా చంద్రబాబు నిర్వహించిన సమీక్షలోనూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల పై పోరాడుతుండడం వల్ల టిడిపికి ఆదరణ పెరిగింది అనే విషయాన్ని గుర్తించిన బాబు సరికొత్త కార్యక్రమానికి తెర తీశారు.గతంలో వినూత్న రీతిలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం సక్సెస్ కావడంతో ఇప్పుడు ఇదేం కర్మ పేరుతో వినూత్న నిరసన కార్యక్రమాన్ని  నిర్వహించేందుకు డిసైడ్ అయ్యారు. 

Tdp Poltical War On Ycp Tdp, Chandrababu Idem Karma, Cbn, Ysrcp, Ysrcp Governmen
Advertisement
TDP Poltical War On Ycp TDP, Chandrababu Idem Karma, CBN, YSRCP, YSRCP Governmen

  తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను హైలెట్ చేసే విధంగా ఇదేం కర్మ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు బాబు సూచించారు.ఇక ఎన్నికల వరకు ఏదో ఒకరకంగా జనాల్లో ఉండే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

     .

Advertisement

తాజా వార్తలు