పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్ రేపు పర్యటించనున్నారు.ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.జగన్ ప్రారంభించనున్న బస్టాండ్, వంద పడకల ఆస్పత్రి పనులను పరిశీలించారు.
చిన్న చిన్న పెండింగ్ పనులు ఉంటే రెండు రోజుల్లో పూర్తి చేసుకోవాలని తెలిపారు.అదేవిధంగా చినమామిడిపల్లి వద్ద నిర్మించిన హెలీప్యాడ్ ను, 25 వార్డు వీవర్స్ కాలనీ వద్ద సీఎం బహిరంగ సభ వేదికను పరిశీలించారు.
ఈ క్రమంలో వేదిక పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.