ఎంపీ అభ్యర్ధుల ' లెక్క ' తేల్చేస్తున్న బాబు ?

ఇటీవల వెలువడిన పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో  టిడిపి అభ్యర్థులు ముగ్గురు విజయం సాధించడంతో ఎక్కడలేని ఉత్సాహంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ( Chandrababu naidu ) ఉన్నారు.ఇదే ఉత్సాహంతో రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాలనే పట్టుదల చంద్రబాబు లో కనిపిస్తోంది.

2024 లో జరగబోయే ఎన్నికలను ఇప్పటి నుంచే ఎదుర్కొనే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు.ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు అసెంబ్లీ అభ్యర్థులను బాబు ప్రకటించారు.

ఇక ఢిల్లీ స్థాయిలోను చక్రం తిప్పే విధంగా ఎంపీ అభ్యర్థుల( MP Candidates ) విషయంలోనూ చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.రాబోయే ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో, ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలను ఎంపీ అభ్యర్థులుగా రంగంలోకి దించి సక్సెస్ అవ్వాలని, తద్వారా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా టిడిపికి ( TDP ) తగిన ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ ఎంపి స్థానాలను గెలుచుకోవాలని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు.దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీ స్థానాల్లో ఎవరెవరిని అభ్యర్థులుగా నిలబెట్టాలనే విషయంపై పూర్తిగా దృష్టి సారించారు.2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన కొంతమంది ఆసక్తిగానే ఉన్నారు.వీరిలో విశాఖపట్నం నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్, విజయనగరం నుంచి మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సిద్ధంగా ఉన్నారు.

ఇక అనకాపల్లి, పాడేరు, అరకు, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన ఎంపీ అభ్యర్థులు చాలామంది పార్టీలు యాక్టివ్ గా ఉండడం లేదు.

Advertisement
Tdp Chief Chandrababu Naidu Finalizing Mp Candidates Details, Tdp,tdp Mp Candida

దీంతో వారి స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు.

Tdp Chief Chandrababu Naidu Finalizing Mp Candidates Details, Tdp,tdp Mp Candida

ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి బాబు , మచిలీపట్నం నుంచి కొనకళ్ల నారాయణరావు సిద్ధంగానే ఉన్నారు.నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.కడప నుంచి శ్రీనివాసరెడ్డి, హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప, అనంతపురం నుంచి జెసి పవన్ కుమార్ రెడ్డి, రాజంపేట నుంచి గంటా నరహరి, నంద్యాల నుంచి మండ్ర శివానందరెడ్డి, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Tdp Chief Chandrababu Naidu Finalizing Mp Candidates Details, Tdp,tdp Mp Candida

ఇక చిత్తూరు, తిరుపతి ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఈసారి తాము తప్పుకుని తమ వారసులను రంగంలోకి దించాలని చూస్తున్నారు.వారి విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది క్లారిటీ లేదు.

ఇక మైదుకూరుకు చెందిన పార్టీ సీనియర్ నేత పుట్టా సుధాకర్ యాదవ్ తన కుమారుడికి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు.యనమల రామకృష్ణుడికి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు అల్లుడు కావడంతో, ఈ సీటు సుధాకర్ యాదవ్ కుమారుడికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ఇక మిగతా నియోజకవర్గాల్లోనూ ఎవరెవరిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలనే విషయంపై పార్టీకి నేతలతో చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట.ఏది ఏమైనా వైసీపీ అభ్యర్థుల కంటే ధీటైన వారిని పోటీకి దించే వ్యూహంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారట.

Advertisement

తాజా వార్తలు