తిరుపతి: టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులను మరోసారి నమ్మించి మోసం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు.ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులను చర్చకు పిలిచారు.ఇచ్చిన హామీని నెరవేర్చే పరిస్థితిలో సిఎం లేరు.
ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది.ప్రభుత్వ ఉద్యోగస్తులు త్వరలోనే వైసిపి ప్రభుత్వానికి బుద్థి చెబుతారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్నాం.దొంగ ఓట్లపై ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయిస్తాం.
ఎన్టీఆర్ మహిళలను ఎంతగానో గౌరవించారు.చంద్రబాబు మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు.
ఎపిలో శాంతి భద్రతలు కరువయ్యాయి.
రోజుకొక హత్య, అత్యాచారం జరుగుతోంది.
సిఎం ఇంటికి దగ్గరగా మహిళపై అఘాయిత్యం జరిగినా బయటకు రాలేదు.జగన్ ప్రతి ఎన్నికను దౌర్బాగ్యమైన ఎన్నికగా మార్చాడు.
ఒక్క తిరుపతి నగరంలోనే 15వేలకుపైగా దొంగ ఓట్లను నమోదు చేశారు.ఆధారాలతో పాటు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇంత వరకు పట్టించుకోలేదు.
దొంగ ఓట్లకు సంతకాలు పెట్టిన గెజిటెడ్ ఆఫీసర్లు జైలుకెళ్ళడం ఖాయం.దొంగ ఓట్లతో గెలవడం ఒక గెలుపేనా.
ప్రజాస్వామ్య బద్థంగా ఎన్నికలు జరిగితే గెలుపు టిడిపిదే.ఎపి పేరు వింటేనే పక్క రాష్ట్రాల వారు అసహ్యించుకుంటున్నారు.ఉపాధ్యాయురాలా ఆలోచించండి.జీతాలు సక్రమంగా ఇవ్వని వ్యక్తి జగన్.
టిడిపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ను గెలిపించండి.రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్ళీ సిఎం కావాలి.ఉపాధ్యాయులను ప్రలోభపెట్టాలని చూస్తున్నారు.5వేలు ఫోన్ పే చేసి ఓటును కొనుక్కుంటున్నారు.