న్యూయార్క్ జిల్లా కోర్ట్ జడ్జిగా భారత సంతతి వ్యక్తి .. నియామకానికి యూఎస్ సెనేట్ ఆమోదముద్ర

న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్‌కు జిల్లా న్యాయమూర్తిగా భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రమణియన్‌ నియామకానికి యూఎస్ సెనేట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది.తద్వారా ఈ బెంచ్‌లో పనిచేసిన తొలి దక్షిణాసియా న్యాయవాదిగా అరుణ్ చరిత్ర సృష్టించారు.

 Us Senate Confirms Indo American Arun Subramanian To Be Southern District Of New-TeluguStop.com

మంగళవారం సాయంత్రం 58-37 ఓట్ల తేడాతో ఆయన నామినేషన్‌కు సెనేట్ ఆమోదం తెలిపింది.ఈ సందర్భంగా సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమెర్ మాట్లాడుతూ.

ఎస్‌డీఎన్‌వై (సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్) న్యాయమూర్తిగా అరుణ్ సుబ్రమణియన్‌ నియామకానికి తాము ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు.ఆయన భారతీయ వలసదారుల కుమారుడని షుమెర్ అన్నారు.

ఇకపై తన కెరీర్‌ను అమెరికా ప్రజల కోసం అంకితం చేస్తాడని షుమెర్ ఆకాంక్షించారు.

ఇప్పటి వరకు అరుణ్ కెరీర్ మొత్తాన్ని సగటు అమెరికన్ల కోసమే వెచ్చించాడని.

సెకండ్ సర్క్యూట్‌లో న్యాయమూర్తి డెన్నిస్ జాకబ్స్‌కు , జడ్జి గెరార్డ్ లించ్, దివంగత జస్టిస్ రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ వద్ద క్లర్క్‌గా పనిచేశారని షుమెర్ పేర్కొన్నాడు.చట్టవిరుద్ధమైన పద్ధతులతో తీవ్రంగా నష్టపోయిన వారిని రక్షించడంలో ఆయనకు సంవత్సరాల అనుభవం వుందన్నారు.

పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగానూ పోరాడాడని షుమెర్ వెల్లడించారు.అమెరికాలోని న్యాయస్థానాలకు అరుణ్ సుబ్రమణియన్ లాంటి వారు అవసరమని ఆయన పేర్కొన్నారు.

Telugu America, Indo American, Judgearun, York, Sdnyjudge, Southernyork, Tejal M

కాగా.అరుణ్ సుబ్రమణియన్ 1979లో పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో జన్మించారు.అతని తల్లిదండ్రులు 1970ల ప్రారంభంలో భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చారు.అరుణ్ తండ్రి పలు కంపెనీలలో కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీర్‌గా పనిచేయగా, తల్లి బుక్ కీపర్‌ సహా అనేక ఉద్యోగాలు చేసింది.

ఇకపోతే.మసాచుసెట్స్ రాష్ట్రంలోని అయర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ తొలి న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన తేజల్ మెహతా నియమితులయ్యారు.

అదే కోర్టులో అసోసియేట్ జడ్జిగా పనిచేసిన ఆమెను జడ్జిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ మేరకు మార్చి 2న తేజల్ చేత న్యాయమూర్తి స్టాసీ ఫోరెస్ట్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Telugu America, Indo American, Judgearun, York, Sdnyjudge, Southernyork, Tejal M

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెహతా కుటుంబానికి చెందిన పలువురు హాజరయ్యారు.వీరిలో ఆమె 14 ఏళ్ల కుమార్తె మేనా షెత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మిడిల్ సెక్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీసులో ప్రాసిక్యూటర్‌గా మారడానికి ముందు సివిల్ వర్క్స్‌లో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు తేజల్ మెహతా. అక్కడ దాదాపు పదేళ్ల పాటు పనిచేసిన ఆమె.సర్క్యూట్ జడ్జిగా, పబ్లిక్ డిఫెండర్‌గాను వ్యవహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube