జగన్‌ సర్కార్‌పై సంచలన గణాంకాలను బయటపెట్టిన టీడీపీ!

ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అని అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్మోహన్‌రెడ్డి చెప్పారు.ఇప్పుడు ఆరు నెలలు గడచిపోయాయి.

 Tdp About Ys Jagan Governament-TeluguStop.com

మరి జగన్‌ మంచి సీఎం అయ్యారా? తాజాగా ప్రతిపక్ష టీడీపీ విడుదల చేసిన గణాంకాలను చూస్తే మాత్రం జగన్‌ తన మాట తప్పినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఆరు నెలల కాలంలో జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఓ బహిరంగ లేఖ రాశారు.

అందులో కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు.జగన్‌ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రం నుంచి రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని ఆయన చెప్పడం గమనార్హం.

Telugu Tdp Sensational, Ys Jagan, Ysrcp-Telugu Political News

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కనపించిన ప్రతిదానికీ తమ పార్టీ రంగులు వేస్తున్న సంగతి తెలుసు కదా.చివరికి సమాధిని, దేవుడిని కూడా వదలకుండా తమ రంగుల పిచ్చిని చాటుకుంటున్నారు.కేవలం ఈ రంగులకే జగన్‌ ప్రభుత్వం రూ.1300 కోట్లు దుర్వినియోగం చేసినట్లు కళా వెంకట్రావు తన లేఖలో ఆరోపించారు.

తన సొంతింటికి జనం సొమ్ముతో మెరుగుతు దిద్దించుకుంటున్నారని, దీనికోసం రూ.17 కోట్లు ఖర్చు చేశారని ఆయన వెల్లడించారు.దేవాలయాలను కూల్చేస్తున్నారని, వక్ఫ్‌ భూములను ఆక్రమిస్తున్నారనీ విమర్శించారు.పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రూ.7500 కోట్ల నష్టం వాటిల్లినట్లు వివరించారు.కేవలం యూనిట్‌కు రూ.4.84కు వచ్చే సౌర విద్యుత్‌ను కాదని కర్ణాటక నుంచి రూ.11.68కి కొంటున్నారని ఆరోపించారు.

సిమెంట్‌ కంపెనీల నుంచి రూ.2500 కోట్ల జే ట్యాక్స్ వసూలు చేశారనీ చెప్పారు.ఓవైపు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తున్నామని చెబుతూ మరోవైపు ఎంతో మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube