నన్నెవరు రేప్ చేయలేదు అంటున్న హీరోయిన్

అందాల తార తాప్సి మళ్ళీ ఫామ్ లోకి వస్తోంది.అయితే ఇప్పుడు బాలివుడ్ మీద ఎక్కువ ధ్యాస పెట్టింది ఈ అమ్మడు.

బేబి లాంటి భారి హిట్ దొరికిన తరువాత తాప్సి జాతకంలో పెద్ద మార్పులే జరిగాయి.ఏకంగా అమితాబ్ బచ్చన్ తో నటించే అవకాసం వచ్చింది.సుజీత్ సర్కార్ దర్శకత్వంలో అమితాబ్ తో తాప్సి కలిసి నటించిన ఈ చిత్రం పేరు "పింక్".

ఈ చిత్రం యొక్క ప్రచారచిత్రం చాలా ఆసక్తికరంగా ఉంది.ఎటువంటి క్లూ వదలకపోయినా, "సెక్స్" వలన ఏదో ఒక పాత్ర ఈ సినిమాలో నష్టపోయింది అనేది మాత్రం కొద్దిగా అర్థమవుతోంది.

ఇక ఈ చిత్రంలో తాప్సి రేప్ విక్టిమ్ గా నటిస్తున్నట్లు ఒక జాతీయ పత్రిక రాసింది.ఏదో ఊరికే రాస్తే వేరే విషయం, కాని స్వయంగా తాప్సి మాట్లాడినట్టుగా ఒక కల్పిత ఇంటర్వ్యూ ప్రచూరించేసింది.

ఆ కల్పిత ఇంటర్వ్యూలోనే "నేను ఒక రేప్ విక్టిమ్ పాత్ర పోషించాను అని తాప్సి అన్నట్లుగా ఉంది.అయితే ఈ విషయాన్ని తాప్సి పూర్తిగా ఖండించింది.

పింక్ లో తాను చేసింది రేప్ విక్టిమ్ క్యారెక్టర్ కాదని, అసలు ఆ ఇంటర్వ్యూ కూడా తాను ఇవ్వలేదని, బాధ్యత ఉండాల్సిన జర్నలిజంకి ఏదో అయ్యిందని తాప్సి చెప్పుకొచ్చింది.

Actress Alaya F Sizzling And Spicy Photos

తాజా వార్తలు