తెలుగు రాష్ట్రాలకు తానా భారీ సాయం..మొత్తం విలువ...రూ...

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలు అన్నిటికంటే కూడా అతి పెద్ద తెలుగు సంఘం.

అమెరికాలో మొదలైన తానా సేవలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికోసం, తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారి కోసం విస్తరించాయి.

తెలుగు భాష, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను భావి తరాలు సైతం అనుసరించేలా చేయడం కోసం తానా చేసే కృషి అంతా యింతా కాదు.అమెరికాలో ఎన్నో సేవా, చైతన్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, స్థానికంగా ఆపదలో, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న అమెరికన్స్ కు సైతం సాయం అందిస్తోంది.

ఈ క్రమంలోనే తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలుగు రాష్ట్రాలలో పర్యటన చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ సాయం ప్రకటించారు.తెలుగు రాష్ట్రాలలో పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న అంజయ్య చౌదరి రాజమండ్రి లో జరిగిన సమావేశంలో కీలక ప్రకటన చేశారు.తెలుగు రాష్ట్రాలకు తానా తరఫునుంచి సుమారు రూ.25 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాలు అందిస్తున్నట్టుగా ప్రకటించారు.ప్రస్తుతానికి ఓడ మార్గంలో తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాయని త్వరలో వాటిని ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు.

అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ మెమోరియల్ ఈ సాయం అందించినట్టుగా అంజయ్య చౌదరి తెలిపారు.తానా, రెడ్ క్రాస్ సాయంతో ఈ విరాళం ప్రభుత్వాలకు అందజేస్తామని తెలిపారు.గతంలో తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టామని, ప్రస్తుతం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు.

Advertisement

ఇప్పటి వరకు సుమారు 40 వేల గుండె ఆపరేషన్లు చేయించామని, 4వేల స్కూల్స్ కి డిజిటల్ క్లాసు రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.భవిష్యత్తులో పెద్ద ఎత్తున క్యాన్సర్ అవగాహన, చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయబోతున్నట్టుగా అంజయ్య చౌదరి ప్రకటించారు.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు