ఆనంద్ మహీంద్రాను మురిపించిన తమిళ యువకుడు

ప్రపంచంలో ఏ మూల ఆసక్తికర విషయం జరిగినా, ఆ స్పూర్తిదాయక వీడియోలను ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటారు.

నిత్యం ట్విట్టర్‌లో అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ ఉంటారు.

ఈ క్రమంలో ఓ తమిళ యువకుడు ఆయనను ఆశ్చర్య పరిచాడు.ఆనంద్ మహీంద్రాతో పాటు ఆ యువకుడి ప్రతిభను నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.తమిళనాడులోని కాంచీపురానికి చెందిన ఓ వ్యక్తి నమ్మశక్యం కాని స్కెచ్‌ ఆర్ట్ వేసి నెటిజన్లను ఆకర్షించాడు.

గణేష్‌గా గుర్తించబడిన కళాకారుడు ఆనంద్ మహీంద్రా చిత్రపటాన్ని చిత్రీకరిస్తున్న వీడియోను పంచుకున్నాడు.మామూలుగా చిత్రం గీస్తే అందులో పెద్ద విశేషమేమీ ఉండదు.

Advertisement
Tamil Man Sketches Portrait Of Anand Mahindra With Ancient Letters Of Tamil Deta

కానీ అక్కడ ఒక ట్విస్ట్ ఉంది.గణేష్ 741 ప్రాచీన తమిళ అక్షరాలతో చిత్రపటాన్ని రూపొందించాడు.

ఫలితంగా మహీంద్రా కూడా ఆ యువకుడి ప్రతిభకు ఆశ్చర్యపోయాడు.దీనికి సంబంధించిన వీడియోను గణేష్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నాడు.దానిని ఆనంద్ మహీంద్రాకు కూడా ట్యాగ్ చేశారు.741 ప్రాచీన తమిళ అక్షరాలతో ఆనంద్ మహీంద్రా ఫోటోను గీశానని, అలాంటి చిత్రాలలో ఇది మొదటిది అని క్యాప్షన్ జోడించారు.తాను వేసిన చిత్రపటంపై పారిశ్రామికవేత్త నుండి అభిప్రాయాన్ని కూడా కోరారు.

Tamil Man Sketches Portrait Of Anand Mahindra With Ancient Letters Of Tamil Deta

గణేష్ ప్రతిభను ఆనంద్ మహీంద్రా మెచ్చుకున్నాడు.ఆయన కూడా తమిళ భాషలో కూడా గణేష్‌కు సమాధానమిచ్చాడు.తమిళ భాషా వైభవం కోసం పాటుపడడం అభినందనీయమని, ప్రాచీన అక్షరాలతో తన చిత్రాన్ని గీయడం అద్భుతమని ప్రశంసించారు.

ఆ చిత్రాన్ని తన ఇంటిలో ఉంచుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.ఇక గణేష్ గీసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.రెండు రోజుల్లోనే 3 లక్షలకు పైగా వ్యూస్ దక్కాయి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
డ్రోన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు.. పెళ్లిలో ఊహించని సీన్.. వీడియో చూస్తే నవ్వాగదు..

గణేష్‌లోని ప్రతిభను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఇక తమిళనాడు ప్రజలకు భాషాభిమానం ఎక్కువనే విషయం తెలిసిందే.

Advertisement

గణేష్ ప్రతిభను మెచ్చుకుంటూ ఆనంద్ మహీంద్రా కూడా తమిళంలోనే జవాబివ్వడంతో వారంతా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

తాజా వార్తలు