బబ్లీ బౌన్సర్ రివ్యూ: తమన్నా ఖాతాలో హిట్ పడినట్లేనా?

మిల్కీ బ్యూటీ తమన్న కీలక పాత్రలో నటించిన తాజా సినిమా బబ్లీ బౌన్సర్.ఈ సినిమాకు డైరెక్టర్ మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించాడు.

 Tamannah Bhatia Babli Bouncer Movie Review And Rating Details, Tamannaah, Tamann-TeluguStop.com

కామెడీ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.ఇక వినీత్ జైన్, అమృత పాండే ఈ సినిమాకు నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.

తనిష్క్ బగ్చి, కరణ్ మల్హోత్రా ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.ఇక ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వగా.

ఈ సినిమా ఈరోజు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా సినీ ప్రియులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

బబ్లీ పాత్రలో కనిపించే తమన్నా.ఢిల్లీకి సమీపంలో ఫతేపూర్ లో ఉంటుంది.

ఇక ఆ ఊరిలో ఉండే కుర్రాళ్ళు అందరూ అక్కడి నుండి ఢిల్లీకి వెళ్లి బౌన్సర్లుగా పని చేస్తూ ఉంటారు.ఇక అందులోనే ఒక కుర్రాడు కుకు (సాహిల్ వైడ్) బబ్లీని చూసి తొలిచూపులతోనే ప్రేమలో పడతాడు.

ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలి అని తన తల్లిదండ్రులతో బబ్లీ ఇంటికి వెళ్తారు.ఇక బబ్లీ అప్పటికే తనకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతూ ఉంటుంది.

కానీ కుకు పెళ్లి చేసుకుంటా అని రావటంతో అతనితో పెళ్లికి ఒప్పుకుంటుంది.ఆ పెళ్లికి ఒప్పుకోవటంతో పాటు ఒక కండిషన్ పెడుతుంది.

అదేంటంటే తాను ఓ సంవత్సరం పాటు ఢిల్లీలో ఉద్యోగం చేస్తానంటుంది.దాంతో బబ్లీ ఇచ్చిన కండిషన్ కు ఒప్పుకొని కుకు తాను పని చేసే నైట్ క్లబ్ లో లేడీ బౌన్సర్ ఉద్యోగం ఇప్పిస్తాడు.

అలా బబ్లీ ఉద్యోగంలో చేరాక ఏం జరుగుతుంది.ఇంతకు అభిషేక్ బజాజ్ తనకు ఎప్పుడు ఎదురవుతారు.

తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు సన్మానం చేస్తారు అనేది మిగిలిన కథలోనిది.

Telugu Babli Bouncer, Bablibouncer, Karan Malhotra, Review, Sahil, Tamannah, Tam

నటినటుల నటన:

ఇందులో తమన్నా బౌన్సర్ గా బాగా ఆకట్టుకుంది.ముఖ్యంగా తన డ్రెస్సింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా చూపించారు.ఇందులో తమన్నా యాటిట్యూడ్ చాలా బాగా ఆకట్టుకుంది.ఇక మిగతా నటీనటులంతా తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

చాలా వరకు డైరెక్టర్ ఈ సినిమాను రొటీన్ గా తీసినట్టు అనిపించింది.మ్యూజిక్ పర్వాలేదు.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.మిగిలిన నిర్మాణ విలువలు తమ పనులకు పూర్తి న్యాయం చేశాయి.

విశ్లేషణ:

కథ చాలా వరకు కొత్తగా ఏమీ అనిపించలేదు.కథను ముందుకు నడిపించిన తీరు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.చాలా వరకు కొత్తదనంగా ఏది కనిపించలేదు.నిజానికి ఇటువంటి కథ ఇదివరకే చూసినట్లుగా అనిపించింది.

Telugu Babli Bouncer, Bablibouncer, Karan Malhotra, Review, Sahil, Tamannah, Tam

ప్లస్ పాయింట్స్:

తమన్నా లుక్స్, మ్యూజిక్.

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ, కథలో కాస్త జాగ్రత్త పడితే బాగుంటుంది.కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసినట్లుగా అనిపించింది.

బాటమ్ లైన్:

రొటీన్ కథ అయినా కూడా అంతగా నష్టమేమీ లేదు అన్నట్లుగా ఉంది.కామెడీ మాత్రం పెద్దగా పండలేదు అని చెప్పవచ్చు.

ఇక ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలా ఉంది అని చెప్పవచ్చు.దీనిని బట్టి చూస్తే తమన్నా ఖాతాలో హిట్టు పడనట్లు తెలుస్తుంది.

రేటింగ్: 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube