మీరు ఇప్పటివరకు కొవిడ్‌ టీకా తీసుకోలేదా? అయితే, ఈ జాగ్రత్తలు తీసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితులు కోట్లలో ఉన్నారు.దీనికి ఎవరూ అతీతులు కారు.

అన్ని దేశాల ప్రభుత్వాలు వ్యాక్సిన్‌ తీసుకోవడంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు.దీనిపై అవగాహన ఉన్నవారు వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు.

కానీ, ఇంకా చాలా మంది ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు.దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు.

కానీ, కొవిడ్‌ బారిన పడకుండా ఉండటం చాలా కష్టతరం.ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వేరియంట్లు కూడా పుట్టుకొస్తున్నాయి.

Advertisement

ఇవి మరింత ప్రమాదకరం.అయితే, కొన్ని సర్వేలు సింగ్‌ల్‌ డోస్‌ లేదా అసలు వ్యాక్సిన్‌ తీసుకోని వారికి కొన్ని సూచనలు చేస్తున్నాయి.

ఏ ఒక్కరూ కూడా కొత్తరకం వేరియంట్ల బారి నుంచి తప్పించుకోలేరు.ముందుగా ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలి.

ఇప్పటికీ అన్ని వ్యాపారాలు, ఉద్యోగాలు మొదలయ్యాయి.పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్సు›్ట కూడా ప్రారం¿¶ మయ్యాయి.

ప్రజలు గుమిగూడటం కూడా మొదలైంది.వీరిలో కొందరు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తారు.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
వీడియో వైరల్.. సీతమ్మ మెడలో తాళి కట్టిన ఎమ్మెల్యే.. ఆగ్రహిస్తున్న ప్రజలు

మరికొందరు పాటించరు.పాఠశాలలు కూడా ప్రారంభించాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి.

Advertisement

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోలేని వారు ఏ విధమైనా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

కరోనా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని అటాక్‌ చేస్తుంది.వారు ఫిట్‌గా ఉన్నా ఆరోగ్యవంతులైనా.ఒకవేళ మీరు ఇప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోలేకపోతే.

వెంటనే తీసుకోండి.మీరు 18 ఏళ్లు లోబడి ఉన్నా.

సివియర్‌ క్రానిక్‌ అనారోగ్యంతో బాధపడేవారు ఈ వైరస్, వేరియంట్ల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి.టీకా తీసుకోలేని వారు చాలా జాగ్రత్తలు వహించాలి.

బయట ప్రదేశాలకు తిరగడం తగ్గించాలి.జనసాంధ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాలకు అస్సలు వెళ్లకూడదు.

రెండు మాస్కులు ధరించడం తప్పనిసరి.దీని వల్ల కాస్త రక్షణగా ఉంటుంది.

ఎక్కడికి వెళ్లిన భౌతిక దూరం పాటిస్తే వైరస్‌ రిస్క్‌ కాస్త తక్కువగా ఉంటుంది.మీరు వ్యాక్సిన్‌ తీసుకోలేదు కాబట్టి మీ కుటుంబ సభ్యులకు కూడా కాస్త దూరం పాటించడం మంచిది.

ఇప్పటికే లాక్‌డౌన్‌లు తొలగించారు.సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఎవరైనా కరోనా నిబంధనలు పాటించకున్నా.

మీరు బాధ్యతగా ఉండాలి.వ్యాక్సిన్‌ తీసుకోవడానికి అర్హత లేని వారు కూడా తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎంత త్వరగా అయితే అంత త్వరగా టీకా తీసుకోవడం చాలా మంచిది.అప్పుడే కొవిడ్‌ వైరస్‌తోపాటు వేరియంట్ల బారి నుంచి రక్షణ కలుగుతుంది.

తాజా వార్తలు