Hsu Ming Chun : భారతీయ కార్మికులపై జాతి విద్వేష వ్యాఖ్యలు .. క్షమాపణలు చెప్పిన తైవాన్ మంత్రి

భారతీయ కార్మికులపై జాతి విద్వేష వ్యాఖ్యలు చేసిన తైవాన్ కార్మిక మంత్రి హ్సు మింగ్ చున్‌( Taiwans Labor Minister Hsu Ming Chun ) వివాదంలో చిక్కుకున్నారు.

అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు.

తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవలి ప్రకటన ప్రకారం.తైవాన్ పరిశ్రమలలో కార్మికుల కొరతను తగ్గించడానికి రెండు దేశాల మధ్య ప్రజల పరస్పర మార్పిడిని పెంపొందించడానికి ఫిబ్రవరి 16న భారత్‌తో తైవాన్ ఎంవోయూపై( Taiwans MoU with India ) సంతకం చేసింది.

అనంతరం భారతీయ కార్మికులను రిక్రూట్ చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది.

Taiwans Labour Minister Hsu Ming Chun Apologises For Racist Jibe Against Indian

ఈ రిక్రూట్‌మెంట్ ప్లాన్‌ను వివరిస్తూ.తైవాన్ టెలివిజన్‌లోని టాక్‌ షోలో హ్సు మాట్లాడారు.తొలుత భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల నుంచి కార్మికులను రిక్రూట్ చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

Advertisement
Taiwans Labour Minister Hsu Ming Chun Apologises For Racist Jibe Against Indian

ఎందుకంటే వారి శరీర ఛాయ, ఆహారపు అలవాట్లు మనకు దగ్గరగా వుంటాయని ఆమె వ్యాఖ్యానించినట్లు తైవాన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ( Taiwan Central News Agency ) (సీఎన్ఏ) మంగళవారం నివేదించింది.దీనికి అదనంగా తయారీ, నిర్మాణం, వ్యవసాయంలో నైపుణ్యం కలిగిన భారతీయుల్లో ఎక్కువగా క్రైస్తవులు వున్నారని హ్సు పేర్కొన్నారు.

రిక్రూట్‌మెంట్ వ్యూహం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంవోఎఫ్ఏ) అంచనాల ఆధారంగా వుందని ఆమె వ్యాఖ్యానించారు.

Taiwans Labour Minister Hsu Ming Chun Apologises For Racist Jibe Against Indian

ఆమె వ్యాఖ్యలపై పాలక డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ శాసనసభ్యుడు చెన్ క్వాన్ టింగ్ ( Chen Quan Ting )మండిపడ్డారు.ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు.హ్సు వ్యాఖ్యలను ఖండించిన ఆయన.వలస కార్మికులను నియమించుకోవడానికి చర్మం, రంగు, జాతి వంటివి ప్రమాణాలు కాకూడదన్నారు.పార్లమెంట్ సభ్యునిగా.

జాతి, సంస్కృతి, మతంతో సంబంధం లేకుండా తైవాన్ ప్రతి ఒక్కరికీ విలువనిస్తుందని టింగ్ పునరుద్ఘాటించారు.అన్ని నేపథ్యాలకు చెందిన వ్యక్తులు గౌరవానికి అర్హులని తన దృఢ విశ్వాసమని.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
కెనడా శుభవార్త.. కొత్త వీసా కేటగిరీలోకి ఆ కార్మికులు

తైవాన్‌లో ఈ సూత్రాన్ని సమర్ధించడానికి తాను కట్టుబడి వున్నానని టింగ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.మంగళవారం ఉదయం జరిగిన శాసనసభ విచారణ సందర్భంగా భారతీయ కార్మికులపై తాను చేసిన వ్యాఖ్యలకు మంత్రి హ్సు క్షమాపణలు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు