సాక్షి అగర్వాల్.( Sakshi Agarwal ) ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్న పేరు.
తాజాగా ఆమె పుదుచ్చేరిలో( Puducherry ) జరిగిన ఒక అమానుష ఘటన గురించి స్పందిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడింది.తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, చంపేసి డ్రైనీజీ కాలువలో పడేశారు.
ముందు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు నమ్మలేని నిజాలను బయటపెట్టేశారు.బాలిక శవం డ్రైనీజీ కాలువలో దొరికింది.
ఆ తరువాత ఆరుగురు మైనర్లు కలిసి ఈ బాలిక మీద అత్యాచారం చేశారని తెలిపారు.
అయితే గంజాయి మత్తులో వారంతా మృగాలుగా వ్యవహరించారని తెలుస్తోంది.
దీంతో తమిళ సమాజం మొత్తం కూడా మండి పడుతోంది.అక్కడి మీడియా సైతం ఈ ఘటన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ట్విట్టర్‌లో ఈ ఘటన మీద చర్చలు జరుగుతున్నాయి.జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది.
న్యాయం చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.వారందరినీ వెంటనే ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.అంతేకాకుండా మైనర్లు అని చూడకూడదని,

ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఘోరాలకు పాల్పడుతుంటే అలాంటి వారిని వదిలేయడం భావ్యం కాదని, వారందరినీ బహిరంగంగా ఉరి తీయాలని, కఠినంగా శిక్షించాలంటూ అంతా డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సాక్షి అగర్వాల్( Bigg Boss Sakshi Agarwal ) సైతం తన ఇన్ స్టా స్టోరీలో స్పందించింది.కోలీవుడ్ ప్రముఖులంతా కూడా ఈ ఘటన మీద స్పందిస్తున్నారు.

గృహలక్ష్మీ కస్తూరీ( Gruhalakshmi Kasturi ) సైతం స్పందించింది.ఈ ఘటన గురించి తెలిసి షాక్ అయ్యాను.గుండె బద్దలైనంత పని అయింది.
తమిళిసై గారు మీరు గవర్నర్‌గా ఉన్న టైంలోనే ఇలా జరిగింది.మీరు ఒక మహిళ, ఒక అమ్మ, ఒక డాక్టర్.
దీనికి మీరు ఏవిధంగా న్యాయం చేస్తారో చెప్పండి అంటూ నిలదీసింది.జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలైన కుష్బూ( Khushboo ) సైతం ఈ ఘటన మీద తీవ్రస్థాయిలో మండిపడింది.
మరి ఇంకా ఈ ఘటనపై ఎవరెవరు స్పందిస్తారో చూడాలి మరి.