తెలుగు అలయెన్స్ ఆఫ్ కెనడా ( తాకా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కెనడాలో అత్యంత వైభవంగా జరిగాయి.అక్కడ స్థానికంగా ఉన్న ఓ స్కూల్ ఆడిటోరియం లో ఈ వేడుకలని తాకా ఏర్పాటు చేసింది.
తానా కార్యదర్శి నాగేంద్ర హంసాల ఆహ్వాన ఉపన్యాసం తెలుగువారిని ఎంతగానో ఆకట్టుకుంది.అక్కడి తెలుగువారి పిల్లలకి బోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు.
చిన్న పిల్లలకి ముగ్గుల పోటీలు, చిత్ర లేఖనం, సంగీతం వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు.ఈ కార్యక్రమాల అనంతరం టాకా అధ్యక్షులు శ్రీనాద్ కుందూరి మాట్లాడుతూ…సంక్రాంతి విశిష్టత గూర్చి తెలియచెప్పారు.
అలాగే భవిష్యత్తు తరాలకి తెలుగు పండుగలని ఇలా పరిచయం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలని కొనసాగించాలని సభ్యులకి తెలిపారు.

అదేవిధంగా ఈ ఏడాది జులై 11,12 తీదీలలో జరగనున్న తాకా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని అందుకు సభ్యులు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.2020 తెలుగు క్యాలెండర్ ని ఆవిష్కరించిన తరువాత తెలుగు వారందరూ కలిసి సంక్రాంతి సాంప్రదాయ వంటలైన , అరిసెలు, పులిహోర, గారెలు వడ్డించుకుని తిన్నారు.ఆ తరువాత ఆట పాటలతో కొందరు సభ్యులు అందరిని అలరించారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి తాకా అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.