ఒకపక్క కరోనా.. మరోపక్క తబ్లీఘీ ల మాయం, అయోమయం లో ప్రధాని

ప్రపంచ వ్యాప్తంగా అల్లాడిస్తున్న కరోనా మహమ్మారి పొరుగుదేశం పాకిస్థాన్ ను కూడా గజ గజవణికిస్తున్న సంగతి తెలిసిందే.

ఒకపక్క ఆర్ధిక సంక్షోభం తో అల్లాడిపోతున్న పాక్ లో ఈ కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవానికి తట్టుకోలేక ప్రపంచ దేశాలను సాయం చేయాలి అంటూ కూడా కోరింది.

కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి అన్న ఆలోచన ఉన్న పాక్ కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది.ఏంటది అంటే రంజాన్ మాసం దగ్గరపడుతుంటే.తబ్లీఘీ సభ్యుల జాడ దొరక్కపోవడం.

ఎందుకంటే.పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గత మార్చి నెలలో తబ్లీఘీలు సమావేశం ఏర్పాటు చేయడం దానికి విదేశీయులు కూడా రావడం తో అక్కడ కరోనా పాజిటివ్ కేసులు అనేవి నమోదు కావడం జరిగింది.

ఈ సమేవేశంలో వేల మంది పాక్‌లోని తబ్లీఘీ సభ్యులు పాల్గొన్నారు.అయితే వీరందరి అడ్రసులు కనుక్కునేందుకు ఎంత ప్రయత్నం చేసినా.

Advertisement

అందర్నీ ట్రేస్ చేయలేకపోతోంది.ఇదే ఇప్పుడు పాక్‌ను కలవరపెడుతోన్న అతిపెద్ద అంశం.

మరోపక్క త్వరలో రంజాన నెల ప్రారంభం కానుండటంతో.కరోనా నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై పాక్ ప్రభుత్వ వర్గాల్లో ఏకాభిప్రాయం కుదరట్లేదు.

పూర్తిగా లాక్‌డౌన్ విధించాలని ఓ మంత్రి అంటే.మరోకరు దీనిని వ్యతిరేకిస్తున్నారు.

అయితే ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం తన మనసులోని మాట బయటపెట్టకుండా.ఇంకా జాప్యం చేస్తూనే ఉన్నారు.

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
రియల్ హీరోకి 100 అడుగుల అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని..

మరోవైపు ఇంకో మంత్రి.అసలు పాక్‌లో కరోనా కేసులు పెరగడానికి తబ్లీగీ సమావేశాలే కారణమంటూ బహిరంగంగానే విమర్శలకు దిగుతుండడం వంటి చర్యలతో ప్రధాని గారికి కంటిమీద కునుకు కూడా లేకుండా పోయింది.

Advertisement

అయితే ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు తబ్లీఘీలకు ఎంతమందికి కరోనా సోకిందన్న దానిపై టెన్షన్ మొదలైంది.వారందర్నీ ఎంత త్వరగా ట్రేస్ చేసి పరీక్షలు నిర్వహిస్తామో అంత త్వరగా కరోనాను కట్టడి చేయవచ్చన్న అభిప్రాయం పాక్‌ మంత్రుల్లో ఉంది.మరి వారి జాడ ఎక్కడ అనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు.

మరి దీనిపై పాక్ ప్రధాని గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు