నటుడుగా మారుతున్న సీనియర్ సంగీత దర్శకుడు

ఇళయరాజా, చక్రవర్తి తర్వాత టాలీవుడ్ లో రాజ్ కోటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

కమర్షియల్ సినిమాలకి, అలాగే సంగీతంలో పాశ్చాత్యం మిక్స్ చేసి తెలుగులో పాటలకి స్పీడ్ తీసుకొచ్చిన సంగీత దర్శకులుగా వీరికి మంచి గుర్తింపు ఉంది.

అయితే ఈ కాంబినేషన్ విడిపోయిన తర్వాత కూడా కోటి సంగీత దర్శకుడుగా తన హవాని కొంత కాలం కొనసాగించాడు.అయితే ఎప్పటికప్పుడు కొత్త సంగీత దర్శకులు వస్తూ ఉండటంతో అతను వెనుకబడిపోయాడు.

అయిన కూడా ఎంతో మంది కొత్త గాయకులని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం.ఇప్పటికే రియాలిటీ షోల ద్వారా ప్రేక్షకులకి దగ్గరగా ఉన్న కోటి తన గొంతుతో తెలుగు ప్రేక్షకులని ఇంత వరకు అలరిస్తూ వచ్చారు.

ఇప్పుడు మొదటిసారి అతను నటుడుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.కోటి పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో ఓ సినిమాకి రంగం సిద్ధం అయ్యింది.

Advertisement

నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో ఎం.యన్‌.ఆర్‌.

చౌదరి నిర్మించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.ఈ సందర్భంగా నర్రా శివనాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివి.

ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ధైర్య సాహసాలతో, నీతి నిజాయతీలతో తమ విధులను నిర్వర్తిస్తున్న పోలీస్‌ అధికారులను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా కోటి ప్రధాన పాత్రలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం అని చెప్పారు.టాలీవుడ్ లో ఒకప్పుడు చక్రవర్తి సంగీత దర్శకత్వం నుంచి నటుడుగా మారి సత్తా చాటారు.

మరి అతని తరహాలోనే కోటి కూడా సిల్వర్ స్క్రీన్ పై నటుడుగా ప్రూవ్ చేసుకుంటారేమో చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు