రజనీతో పోటీ అంటే సూర్య భయపడ్డారా.. వెనుకడుగు వేయడం వెనుక కారణాలివేనా?

ప్రస్తుతం పెద్ద సినిమాలకు సరైన రిలీజ్ డేట్ ను సెట్ చేసుకోవడం నిర్మాతలకు సమస్యగా మారిందనే సంగతి తెలిసిందే.

అక్టోబర్ నెల 10వ తేదీన మొదట కంగువా సినిమా( Kanguva ) రిలీజ్ కానుందని ప్రకటన వెలువడగా ఆ తర్వాత వేట్టయాన్ మూవీ( Vettaiyan ) రేసులో చేరింది.

ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైతే రెండు సినిమాలకు కలెక్షన్ల పరంగా ఇబ్బందేనని సోషల్ మీడియాలో కామెంట్స్ వ్యక్తమయ్యాయి.అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం కంగువా సినిమా బాక్సాఫీస్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్టేనని సమాచారం అందుతోంది.

రజనీతో( Rajinikanth ) పోటీ అంటే సూర్య భయపడ్డారని కామెంట్లు వినిపిస్తున్నాయి.కంగువా సినిమా దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది.

పోటీ వల్ల కలెక్షన్ల విషయంలో ఈ సినిమా భారీ స్థాయిలో నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Surya Backstep About Kanguva Movie Release Details, Surya , Kanguva Movie, Kangu
Advertisement
Surya Backstep About Kanguva Movie Release Details, Surya , Kanguva Movie, Kangu

అయితే కంగువా సినిమా దసరా రేస్ నుంచి తప్పుకుంటే మళ్లీ ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.అక్టోబర్ రేస్ నుంచి తప్పుకుంటే కంగువా సినిమాకు కొత్త రిలీజ్ డేట్ దొరకడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కంగువా సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయనే సంగతి తెలిసిందే.

Surya Backstep About Kanguva Movie Release Details, Surya , Kanguva Movie, Kangu

కంగువా సినిమా ఇతర భాషల్లో సైతం సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.కంగువా సినిమా భూత, భవిష్యత్తు కాలాలకు సంబంధించిన కథతో తెరకెక్కుతోందని తెలుస్తోంది.సూర్య( Surya ) ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

అయితే వేట్టయాన్, కంగువా వేర్వేరు తేదీలలో విడుదలైతేనే మంచిదని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.ఈ రెండు సినిమాలు ఎప్పుడు విడుదలైనా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని సినీ అభిమానులు భావిస్తున్నారు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు