Surekha : ఆ స్టార్ హీరోని పెళ్లి చేసుకోవాల్సిన సురేఖ.. కానీ చిరంజీవికి భార్య ఎలా అయిందంటే..?

అల్లు రామలింగయ్య కూతురు సురేఖ( Surekha ) ని రామలింగయ్య ఎంతో ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.

చిన్నప్పటినుండి అలా గారాబంగా పెరిగిన సురేఖ మెగా ఫ్యామిలీలోకి ఎప్పుడు అయితే అడుగుపెట్టిందో అప్పటినుండి మెగా ఫ్యామిలీ దశ తిరిగిపోయింది అని చెప్పవచ్చు.

ఒక రకంగా సురేఖతో మెగా ఫ్యామిలీ ( Mega family ) కి అదృష్టం వచ్చి పడిందని చెప్పుకోవచ్చు.అయితే అలాంటి సురేఖ మొదట పెళ్లి చేసుకోవాలనుకుంది చిరంజీవిని కాదట.

మరో స్టార్ హీరో నట.మరి ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా.అల్లు రామలింగయ్య ( Allu Ramalingaiah ) అప్పుడప్పుడే ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకుంటున్న చిరంజీవి కష్టాన్ని,ప్రతిభను చూసి ఎంతగానో మురిసి పోయారు.

Surekha Was Supposed To Marry That Star Hero But

అంతేకాదు తన ఇంటికి అల్లుడుగా తన కూతురికి భర్తగా చిరంజీవి( Chiranjeevi ) కరెక్ట్ గా సెట్ అవుతారని,ఎప్పటికైనా సరే చిరంజీవి ఇండస్ట్రీని ఏలే హీరోగా మారతారని ఆయన అంచనాలు వేసి అప్పటినుండి చిరంజీవి ని అడుగడుగునా ఫాలో అవుతూ.ఆయన ఏం చేస్తున్నారు ఆయన అలవాట్లు ఏంటి అనేది తెలుసుకుంటూ అల్లు రామలింగయ్య అలాగే ఆయన కొడుకు అల్లు అరవింద్( Allu Aravind ) ఇద్దరు ఆయనను ఫాలో అయ్యేవారట.

Surekha Was Supposed To Marry That Star Hero But
Advertisement
Surekha Was Supposed To Marry That Star Hero But-Surekha : ఆ స్టార�

ఇక ఫైనల్ గా చిరంజీవి అన్ని విషయాల్లో కరెక్ట్ అని తెలిసి నేరుగా తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడగడం, పెళ్లవ్వడం ఇలా అన్ని చకచగా జరిగిపోయాయి.అయితే చిరంజీవి కంటే ముందే సురేఖని ఓ స్టార్ హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలని అల్లు రామలింగయ్య ( Allu Ramalingaiah ) అనుకున్నారట.అయితే చిరంజీవి కంటే ముందే ఆయన ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నారు.

అంతేకాకుండా ఆస్తిపాస్తులు అన్ని బాగానే ఉన్నాయి.ఇక సురేఖ( Surekha ) కు కూడా ఆ హీరో నచ్చాడట.

ఇక పెళ్లి చేద్దాం అనుకునే టైంలో సురేఖ అలాగే ఆ హీరో జాతకాలు ఇద్దరివి ఓసారి తమకు నమ్మకంగా ఉండే ఓ జ్యోతిష్యుడికి చూపించారట.అయితే వీరిద్దరి జాతకాలు పరిశీలించిన ఆ జ్యోతిష్యుడు జాతకాలు అస్సలు కలవలేదని,పెళ్లి చేస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పడంతో అల్లు రామలింగయ్య తన కూతుర్ని ఆ హీరోకి ఇచ్చి పెళ్లి చేయడం మానుకున్నారట.

ఆ తర్వాత చిరంజీవికి ఇచ్చి చేశారు.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement
" autoplay>

తాజా వార్తలు