Supritha : అలాంటి అంకుల్ దొరికితే అమ్మకు రెండో పెళ్లి చేస్తా.. సుప్రీత కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సురేఖ వాణి( Surekha Vani ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఈమె ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో ఎన్నో పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అయినటువంటి సురేఖ వాణి ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి.ఇక ఈమె తన కుమార్తె సుప్రీత( Supritha ) తో కలిసి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇక సుప్రీత కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఇగో సురేఖ వాణి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె భర్త సురేష్ తేజ ( Suresh Teja ) 2019వ సంవత్సరంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు.అప్పటినుంచి తన  కుమార్తెతో కలిసి ఈమె ఒంటరిగా గడుపుతున్నారు.

అయితే సురేఖ వాణి రెండో పెళ్లి ( Second marriage ) చేసుకోబోతుంది అంటూ పలు సందర్భాలలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఆ వార్తలను సురేఖ వాణి పూర్తిగా ఖండించేశారు.

Advertisement

ఇటీవల సురేఖ వాణి కుమార్తె సుప్రీత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన తల్లి రెండో పెళ్ళి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ సందర్భంగా ఆమె తన తల్లి రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ.

అమ్మకు కచ్చితంగా రెండో పెళ్లి చేస్తానని తెలిపారు.అయితే అమ్మను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు సరిపోరని అంకుల్స్( Uncles ) కావాలని ఈమె తెలిపారు.

తనని ఇలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా తనని మంచిగా చూసుకొని అంకుల్ దొరికితే తప్పకుండా తన తల్లికి రెండో పెళ్లి చేస్తాను అంటూ ఈ సందర్భంగా సురేఖ వాణి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు