ఇకపై ప్రాంతీయ భాషల్లో కూడా అందులోబాటులో ఉండనున్న సుప్రీం తీర్పులు

అత్యున్నత న్యాయస్థానం తీర్పులు ఇక ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

సుప్రీం కోర్టు తీర్పులు ఇక ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవల సూచన చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాష్ట్రపతి సూచన మేరకు ఈ నెలాఖరు నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది.దీనిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కూడా ఇటీవల వెల్లడించారు కూడా.

ఇక పై సుప్రీం తీర్పులను ప్రాంతీయ భాషల్లోనూ అనువాదం చేసేందుకు వీలుగా ఓ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నామని, దానితో ప్రాంతీయ భాషల్లో కూడా ఇక పై తీర్పులు చదువుకోవచ్చు అని తెలిపారు.ఇంగ్లీష్‌లో వెలువరించిన తీర్పులు అదే రోజున వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుండగా.

ప్రాంతీయ భాషల్లోని తర్పులు వెబ్‌సైట్‌లో ఉంచడానికి వారం రోజులు పట్టనుంది.

Advertisement

కాగా తెలుగుతో పాటు అస్సామీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్ భాషల్లోనూ తీర్పులు అనువదించనున్నట్లు తెలుస్తుంది.ఇప్పటివరకు సుప్రీం కోర్టు తీర్పు అంటేనే ఇంగ్లిష్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.అయితే ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి వీలుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

దీనితో ప్రతి ఒక్కరూ తమ తమ భాషల్లో చక్కగా సుప్రీం తీర్పులను చదువుకోవచ్చు అన్నమాట.

Advertisement

తాజా వార్తలు