కేంద్ర ప్రభుత్వం పై సీరియస్ అయిన సుప్రీం కోర్ట్..!!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం పై సీరియస్ అయింది.

కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందించకపోవడం పై అసహనం వ్యక్తం చేయడం జరిగింది.

పరిహారంమరణ ధ్రువీకరణ పత్రాలకు మార్గదర్శకాలు రూపొందించిక పోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.కోవిడ్ మరణాలకు సంబంధించి మరణ ధ్రువీకరణ పత్రాల కోసం మార్గదర్శకాల ఆదేశాలు జారీ చేసినా వాటిని పట్టించుకోరా అంటూ కేంద్రంపై సీరియస్ అవ్వడం జరిగింది.

కరోనా కారణంగా మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని జూన్ 30న ఇచ్చిన ఆదేశాలు సెప్టెంబర్ 8వ తారీకున గడువు ముగియనున్న నేపథ్యంలోకేంద్రంలో కదలిక లేకపోవడంతో సుప్రీం న్యాయమూర్తులు సీరియస్ వ్యక్తం చేయడం జరిగింది.కరోనా మృతులకు పరిహారం విషయంలో సెప్టెంబర్ 11 వ తారీకు లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని తాజాగా కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

జాతీయ విపత్తు నిర్వహణ చట్ట ప్రకారం నాలుగు లక్షల పరిహారం చెల్లించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ నీ సుప్రీం విచారించడం జరిగింది.ఈ క్రమంలో బాధితులకు పరిహారం విషయంలో ఎంత ఇవ్వాలి అనే దానిపై తాము డిసైడ్ చేయలేము కేంద్ర ప్రభుత్వమే మొత్తాన్ని నిర్ణయించాలని సూచించింది.

Advertisement
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

తాజా వార్తలు