పొడి దగ్గు విపరీతంగా వేధిస్తుందా.. ఇలా చేస్తే రెండు రోజుల్లో పరారవుతుంది!

పొడి దగ్గు( Cough ).చాలా మందిని అత్యంత సర్వ సాధారణంగా వేధించే కామన్ సమస్య ఇది.

సీజన్ తో పని లేకుండా ఎందరో మంది పొడి దగ్గుతో తీవ్రంగా సతమతం అవుతుంటారు.పొడి ద‌గ్గు కారణంగా చేసే పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.

అలాగే రాత్రుళ్ళు సరైన నిద్ర కూడా ఉండదు.మిమ్మల్ని కూడా పొడి ద‌గ్గు విపరీతంగా వేధిస్తుందా.? ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదా.? అయితే ఈ రెమెడీని మీరు ప్రయత్నించాల్సిందే.ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ రెమెడీని పాటిస్తే రెండు రోజుల్లో పొడి దగ్గు పరార్ అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక పెద్ద అల్లం ముక్క( Ginger )ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి సన్నగా తురుముకోవాలి.

Advertisement

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.

నెయ్యి కాస్త హీట్ అవ్వగానే అల్లం తురుము వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి.ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేయాలి.చివరిగా నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు బెల్లం తురుము( Jaggery ) వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి.

ఈ మిశ్రమాన్ని వన్ టేబుల్ స్పూన్ చొప్పున రోజుకు రెండు సార్లు అంటే ఉదయం సాయంత్రం తీసుకోవాలి.ఇలా చేస్తే ఎలాంటి దగ్గు అయినా దెబ్బకు పరార్ అవుతుంది.దగ్గు సమస్యను నివారించడానికి ఈ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

కాబట్టి గ‌డ్డుతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.జలుబు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలకు చెక్ పెట్ట‌డానికి కూడా ఈ రెమెడీని ఉపయోగ‌ప‌డుతుంది.

Advertisement

తాజా వార్తలు