కంది సాగులో మారుకా మచ్చ పురుగులను అరికట్టే పద్ధతులు..!

కంది పంట ఖరీఫ్ లో సాగు చేయబడుతుంది.కంది పంట( Kandi crop ) పూత, పిందే దశలో ఉన్నప్పుడు వివిధ రకాల చీడపీడల బెడద చాలా అధికంగా ఉంటుంది.

 Methods To Prevent Maruka Spot Insects In Kandi Cultivation , Kandi Cultivation-TeluguStop.com

ఈ చీడపీడలతో దిగుబడి సగానికి పైగా తగ్గి తీవ్ర నష్టం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.కాబట్టి కంది పంటను పండించే రైతులు పూత, పిందె దశకు కంది పంట వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించి చీడపీడలను ఎప్పటికప్పుడు అరికట్టాలి.

పంట వేయకముందు నేలను లోతుగా దుక్కులు దున్నాలి.పొలంలో ఇతర పంటల అవశేషాలను శుభ్రం చేసేయాలి.అధిక వర్షం( heavy rain ) కురిచినప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.పురుగులను ఆశించే మొక్కలను పొలంలో అక్కడక్కడ వేసుకోవాలి.

కచ్చితంగా రెండు లేదా మూడు సంవత్సరాల లోపు పంట మార్పిడి చేయాలి.ఎకరం పొలంలో అక్కడక్కడ 10 పక్షి స్థావరాలను అమర్చుకోవాలి.

పొలంలో నాలుగు లింగాకర్షణ బుట్టలను అమర్చాలి.అవసరాన్ని బట్టి పొలంలో పరాన్న జీవులను వదలాలి.

Telugu Agriculture, Chlorie Pyripas, Flu, Kandi, Latest Telugu, Spino Sad-Latest

కంది పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడలలో మారుక మచ్చల పురుగు కీలక పాత్ర పోషిస్తుంది.ఈ పురుగులు పూతపై, పిందెలపై, కాయలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.కంది పంట పూత దశలో ఉన్నప్పుడు వాతావరణం లో తేమశాతం అధికంగా ఉంటే ఈ పురుగులు పంటను ఆశిస్తాయి.అంటే వాతావరణం కారు మబ్బులతో మేఘ వృతం అయిన సమయాలలో పంటను గమనించి ఈ చీడిపీడలను గుర్తించి నివారించాలి.

Telugu Agriculture, Chlorie Pyripas, Flu, Kandi, Latest Telugu, Spino Sad-Latest

తొలి దశలో క్లోరీ పైరిపాస్( Chlorie Pyripas ) 2.5 మి.లీ ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.ఒకవేళ ఈ పురుగుల వ్యాప్తి చాలా అధికంగా ఉంటే స్పైనో శాడ్ 0.75 మి.లీ లేదా ఫ్లూ బెండమైడ్ 0.2 మి.లీ లలో ఏదో ఒక దానిలో లీటర్ నీటిని కలిపి పంటకు పిచికారి చేసి ఈ పురుగులను తొలి దశలోనే అరికడితే అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube