తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది కాజల్ అగర్వాల్.
కాజల్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.కాజల్ ని అభిమానులు ముద్దుగా చందమామ అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఇకపోతే ఈమె ప్రస్తుతం తల్లిగా తన కొడుకు అలాగే కోడలుగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మాతృత్వం కోసం సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది కాజల్ అగర్వాల్.కాగా కాజల్ 2020లో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లి( Gautham Kitch ) చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించాడు.
ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన కాజల్ ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భగవత్ కేసరి సినిమాలో( Bhagwat Kesari movie ) నటిస్తోంది.ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ కి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే కాజల్ సినిమాలకు గుడ్ బై( Kajal Good bye to movies ) చెప్పనుందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అందుకు ప్రధాన కారణం తన బాబు నీల్ అని తెలుస్తోంది.సినిమాల్లో ఉంటే నిత్యం బాబుకు దూరంగా ఉండాల్సి వస్తోంది.
బాబు ఎదుగుతున్న వేళ తల్లి ప్రేమను అందించాలని, అది తన బాధ్యతని కాజల్ నిర్ణయించుకుందట.తన భర్త కిచ్లూ కూడా ఇదే మాట చెబుతున్నారట.
ఈ విషయం పై త్వరలో అఫిషయల్ గా కాజల్ ప్రకటించనున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే ఇందులో నిజా నిజాలు తెలియాలి అంటే కాజల్ క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.ఈమె ప్రస్తుతం ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2, బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలలో నటిస్తోంది.