పుష్పలో ఐటమ్ సాంగ్‌కు సన్నీ భారీ డిమాండ్.. ఎంతంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్య, ఆర్య 2 చిత్రాలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి "పుష్ప" అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక సందడి చేయనున్నారు.గంధం చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పోటీ పడటానికి మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌ పాత్రలో కనిపిస్తున్నారు.

ఇక ఈ అద్భుతమైన కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలా ఉంటుందో ఇదివరకే ఎన్నో సినిమాలలో చూసాము.

అయితే పుష్ప సినిమాలో ఆర్య, ఆర్య 2 సినిమాలలో కంటే అద్భుతంగా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాటను తెరకెక్కించాలని డిఎస్పీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ ఐటెం సాంగ్ లో బన్నీ సరసన నటించడం కోసం పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి.

మొదట్లో ఈ సినిమాలో ప్రత్యేక పాటలో నటించడం కోసం చిత్రబృందం దిశాపటాని సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి.ఆ తర్వాత తెరపైకి ఊర్వశి రౌటేలా పేరు వచ్చింది.ఇక తాజాగా ఆమె స్థానంలో బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ పేరు వినబడుతోంది.

ఈ బ్యూటీ పుష్పా సినిమాలో అల్లు అర్జున్ సరసన ప్రత్యేక పాటలో చేయడం కోసం భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

కేవలం ఒక ఐటమ్ సాంగ్ కోసం మాత్రమే ఈ బ్యూటీ ఏకంగా 90 లక్షల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని వార్త వినబడుతుంది.ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటం చేత ఆమె అడిగినంత ఇవ్వడానికి మేకర్స్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమా రెండు భాగాలుగా ఉండబోతోందని, మొదటి పార్ట్ ఈ ఏడాదిలో విడుదల కాగా రెండో పార్ట్ వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు