వేసవి నట్టనడి స్టేజిలో ఉంది.సహజంగా మే రెండొవ వారం, మూడోవ వారం ఎండ తీవ్రత ఉచ్చస్థాయికి వెళుతుందని చెబుతారు.
ఈసారి కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.భానుడి భగభగకి భయపడి సాధ్యమైనంత వరకు ఎండలో బయటకి వెళ్ళే ప్రయత్నాలు మానేస్తున్నా, పనులన్ని వాయిదా వేసుకోని ఇంటిపట్టునే కూర్చోని ఉండలేం కదా.
ఇక ఔట్ డోర్ పనులు చేసేవారి పని మరింత దారుణం.నీళ్ళు బాగా తాగి వెళితే సన్ స్ట్రోక్ ని నివారించడం సాధ్యపడుతుందేమో కాని, సన్ బర్న్ నుంచి మాత్రం తప్పించుకోవడం కొంచెం కష్టమే.
ఈ సన్ బర్న్ అంటే ఏమిటి? ఏమి లేదు, ఎండ తీవ్రత వలన చర్మం యొక్క రంగుతో పాటు టెక్చర్ మారడం.అంటే ఎర్రగా మండుతున్నట్టు అయిపోవడం, లేదా నల్లగా సన్ బర్న్ వలన కేవలం చర్మానికే నష్టం, మిగితా శరీరం బాగానే ఉంటుందని అనుకోకండి.
చర్మ సమస్యలు మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి.* సన్ బర్న్ వలన తలనొప్పి వేయవచ్చు.కొందరికి ఇది తీవ్రస్థాయిలో ఉంటుంది.అంటే ఎండలో మీరు గడిపిన సమయాన్ని బట్టి.
* రెండు నిమిషాల క్రితం నీళ్ళు తాగిన దాహమేస్తుంది.అది మామూలుగా ఉండదు.
తీవ్రస్థాయిలో ఉంటుంది.గొంతు ఆరిపోయిన సెన్సెషన్ ఉంటుంది.
* వాంతులు అవుతాయి.మూర్ఛ కూడా రావొచ్చు.
తీవ్రమైన అలసట ఉండొచ్చు.* స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇందులో మరో విడ్డూరమైన విషయం ఏమిటంటే, తెల్లగా, ఎర్రగా ఉండే వారిలో ఈ అవకాశాలు ఇంకా ఎక్కువ.
ఇక చర్మ సమస్యల దగ్గరికి తిరిగి వస్తే ముఖం మీద కూడా దురద పుట్టవచ్చు.కొందరికి చర్మం ఊడుతున్నట్లు ఉంటుంది.మంట, దురద, నొప్పి .అబ్బో .ఇంకా చాలానే ఉంటాయి.అసలు ఈ సన్ బర్న్ ఎందుకు వస్తుంది అంటే సింపుల్ గా ఎండ వలన అని చెప్పొద్దు.
కాస్తైనా విజ్ఞానం ఉండాలి కదా.అల్ట్రా వాయిలేట్ రేస్ (UV Rays) తాకిడికి ఇలా అవుతుంది.సూర్యుడి నుంచి వెలువడే ఈరకం కిరణాలు చర్మానికి బద్ధ శతృవులు.
ఈ కిరణాల వలనే చర్మం రంగులో మార్పులు, చర్మం యొక్క టెక్చర్ లో మార్పులు, మంట, మొటిమలు, పొక్కులు.ఇలా అన్ని వీటివల్లే.
* సన్ స్క్రీన్ లోషన్ వాడటం అలవాటు చేసుకోవాలి.La Shield Sun Screen Gel SPF40, ఈ లోషన్ రూ.670 నుంచి రూ.750 మధ్య దొరుకుతుంది.తక్కువ ధరలో లభ్యమై, చర్మానికి కవచంలా పనిచేస్తుంది.
* ఇక ముఖానికి మాస్క్ వాడటం, నెత్తికి టోపి వాడటం లాంటివి మీకు తెలుసు.
మంచినీటితో పాటు కొబ్బరినీళ్ళు ఉండాలి.* విటమిన్ సి తీసుకోవాలి.
Limcee 500MG లాంటి టాబ్లేట్స్ చాలా చవకగా దొరుకుతాయి.విటమిన్ సి సెరమ్ తో రోజు చర్మానికి మర్దన చేయాలి.
మళ్ళీ మీ రంగు మీకు వచ్చే మార్గం ఇదే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy