పాపం, పుష్ప 2 సినిమా సుకుమార్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది?

పుష్ప సినిమా( Pushpa ) పేరు వినగానే ముందుగా, ఆ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్,( Director Sukumar ) ఆ సినిమాలోని నటించిన అల్లు అర్జున్( Allu Arjun ) అందరికీ గుర్తుకు వస్తారు.

అంతలా ఈ సినిమా మొదటి పార్ట్ జనాలలోకి దూసుకు పోయిందని చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలోనే పుష్ప పార్ట్ 2( Pushpa 2 ) ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.ఇక తెలుగు సినిమా స్థాయి దిగాంతాలకు చేరుకున్న నేపథ్యంలో, స్టార్ హీరోలు అనబడేవారు వాళ్ళ సినిమాలను భారీ రేంజ్ లో రిలీజ్ చేయడానికి అన్ని విధాలా సిద్ధ పడుతున్నారు అని చెప్పుకోవచ్చు.

మరి అల్లు అర్జున్ ఊరుకుంటాడా? పుష్ప సినిమాతో అల్లు అర్జున్ స్టామినా ఏమిటో నార్త్ సర్కిల్స్ లో కూడా అర్ధం అయింది.దాంతో పుష్ప 2 సినిమాని కూడా అదే రేంజులో విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు సదరు సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్.

ఇక అసలు విషయంలోకి వెళితే, పుష్ప 2 సినిమా కోసం దర్శకుడు సుకుమార్ విపరీతంగా కష్టపడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.హెల్త్ కండిషన్ బాగా లేకపోయిన కూడా హాస్పిటల్ కి వెళ్లకుండా కేవలం టాబ్లెట్స్ ని మాత్రమే వేసుకుంటూ, షూటింగు లొకేషన్లో మాత్రమే గడుపుతున్నాడని టాక్ నడుస్తోంది.మరో పక్క అల్లు అర్జున్ కూడా ఎక్కడా రాజీ పడకుండా చేయవలసిన సీన్లనే పదే పదే చేస్తూ ఇంకా మెరిట్ రావాలనే ఉద్దేశంతో రిహార్సల్స్ మీద రిహార్సల్స్ పెడుతూ, చిత్ర యూనిట్ కి నరకం చూపుతున్నాడని టాక్ నడుస్తోంది.

Advertisement

మొత్తానికైతే ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలని గట్టిగా అనుకున్నట్టు కనబడుతోంది.

మరీ ముఖ్యంగా, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ విషయంలో అల్లు అర్జున్ అస్సలు తగ్గడం లేదని తెలుస్తోంది.దాదాపు 2 నెలల నుండో ఆ ఒక్క ఫైట్ మాత్రమే చిత్రీకరిస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.ఇక దాంతో చిత్ర నిర్మాతలు కూడా చేయవలసిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారని టాక్ వినబడుతోంది.

ఇక అన్నీ కుదిరి సినిమా హిట్ అయితే పర్వా లేదు గానీ, కాస్త తేడా కొడితే మాత్రం ఇక నిర్మాతలు గల్లంతయ్యే అవకాశం ఉంది.అయితే, ఈ సినిమా అందరూ అనుకున్నట్టుగానే డిసెంబర్ 6నే జనాలు ముందుకు తీసుకు రావడానికి చిత్ర యూనిట్ కష్టపడుతోంది.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు