అదృష్టం: వర్షం వచ్చింది.. కోటీశ్వరుడయ్యాడు!

నిజంగా కొందరు సంపాదించాలని.కోటీశ్వరులు అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.

కానీ ఫలించదు.

అదేంటో మరి.కొందరు ఉన్నట్టుండి అదృష్టవంతులు అయిపోతారు.మొన్నటికి మొన్న ఓ వ్యక్తి తల్లితో షాపింగ్ కి వెళ్లి అనుకోకుండా కోటీశ్వరుడు అయ్యాడు.

ఇప్పుడు వర్షం పడుతుంటే దాని నుంచి తప్పించుకునేందుకు షాపింగ్ కి వెళ్లిన వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.అమెరికాలోని వర్జీనియాకు చెందిన వ్యక్తి ఇటీవల బయటకు వచ్చాడు.

అయితే అప్పుడే వర్షం మొదలైంది.చేసేదేం లేకా రోడ్డు పక్కన ఓ చోట ఆగాడు.

Advertisement

వర్షం నుంచి తప్పించుకోవాలంటే ఎం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా ఎదురుగా ఓ షాపింగ్ మాల్ కనిపించింది.దీంతో అతను నేరుగా ఆ మాల్ కి వెళ్ళాడు.

అలా అలా మాల్ చూస్తుంటే లాటరీ కనిపించింది.దీంతో ఆ లాటరీ టికెట్ ని కొనుక్కొని జేబులో పెట్టుకున్నాడు.

ఇంట్లో పెట్టి మర్చిపోయాడు.అయితే లాటరీ ఫలితాలు వచ్చిన విషయం తెలుసుకున్న అతను తన దగ్గర ఉన్న టికెట్ తీసి చూడగా అతడు ఆశ్చర్యపోయాడు.

ఎందుకంటే అతను కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు ఏకంగా 1,58,377 డాలర్లు అంటే ఇండియాన్ కరెన్సీలో ఏకంగా కోటి 18 లక్షల రూపాయిల నగదు బహుమతి వచ్చింది.దీంతో ఆ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు