దొంగలను పట్టించిన ఆన్ లైన్ క్లాస్...!

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కు పోయినట్లు అయింది ఈ దొంగల పని.

ఈక్వెడార్ దేశంలోని ఓ ఇంట్లో దొంగతనం చేసిన దొంగలకు అక్కడ ఆన్లైన్లో క్లాసులు వింటున్న ఓ పాఠశాల విద్యార్థిని కనపడింది.

కేవలం చిన్న అమ్మాయి ఉన్న విషయాన్ని గమనించిన వారు ఆ చిన్నారిని బెదిరించి ఆ అమ్మాయి ఇంటిని మొత్తం దోచేశారు.అయితే ఇందుకు సంబంధించిన పూర్తి తతంగమంతా ఆన్ లైన్ క్లాసులు వింటున్న తోటి విద్యార్థులు గమనించారు.

ఇక ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఈక్వెడార్ దేశంలోని అంబాటో నగరానికి చెందిన ఓ విద్యార్థిని ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో జూమ్ యాప్ ద్వారా తరగతులను వింటోంది.

ఆ అమ్మాయి తో పాటు తన స్నేహితులు మొత్తం 25 మంది జూమ్ యాప్ లో తరగతిని వింటున్నారు.అయితే సడన్ గా సదరు అమ్మాయి ఇంటిలోకి దొంగలు ప్రవేశించారు.

Advertisement

ఇకపోతే ఇంట్లోకి వచ్చిన దొంగలు సదరు అమ్మాయి ఆన్ లైన్ క్లాస్ వింటుందని, అయితే ఆ విషయాన్ని గమనించకుండా దొంగలు వారి పని వారు చేస్తున్నారు.అంతలోనే ముసుగు ధరించిన దొంగలు ఆ అమ్మాయిని బెదిరించడం స్నేహితులందరూ ఆన్ లైన్ లో చూస్తూనే ఉన్నారు.

దీంతో వెంటనే ఆ విషయాన్ని టీచర్ కు తెలపగా ఇంతలో ఓ విద్యార్థి సదరు అమ్మాయి ఇంటి అడ్రస్ ఎవరి దగ్గరైనా ఉందేమో అని కనుక్కొని వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు.అంతే కాదు అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించారు.

ఇంతలో దొంగలు ల్యాప్ టాప్ తో సహా ఇంట్లోనే కొన్ని విలువైన వస్తువులను కూడా దొంగిలించారు .దీంతో కొద్దిసేపటి తర్వాత వచ్చిన పోలీసులు జరిగిన విషయం తెలుసుకుని ఆపై దొంగలు తీసుకెళ్లిన వస్తువుల్లో ఉన్న మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయడంతో సదరు దొంగలు పోలీసులకు చిక్కారు.దీంతో మొత్తం నలుగురు దొంగలని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు