ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం తిన్నవెంటనే ఆ యువకుని పరిస్థితి ఎలా మారిందంటే..

ఆధునిక యగంలో ప్రజల ఆహారపు అలవాట్లలో పెనుమార్పులు వచ్చాయి.పూర్వకాలంలో ప్రజలు పౌష్టికాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.

ఇప్పుడు చాలామంది మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచి తరువాత తింటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం కొన్నిసార్లు ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.

చాలా మంది ఆహారాన్ని ఫ్రిజ్‌లోంచి తీసి వేడి చేసి తింటుంటారు.దీని వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

మీరు కూడా ఇలా చేస్తుంటే జాగ్రత్తగా వ్యవహరించండి.ఈ కోవలోకి వచ్చే ఒక ఉదంతం ఒకటి తెరపైకి వచ్చింది.

Advertisement

ఒక యువకుడు ఫ్రిజ్‌లో ఉంచి ఆహారానని తిన్న కారణంగా తన రెండు కాళ్ళను పోగొట్టుకున్నాడు.అంతేకాదు అతడి రెండు చేతుల వేళ్లను తీసివేయాల్సివచ్చింది.

మెడికల్ రిపోర్ట్ ప్రకారం.జెస్సీ అనే యువకుడు తన డిన్నర్ కోసం రెస్టారెంట్ నుండి డిన్నర్‌కు నూడుల్స్, చికెన్ తీసుకువచ్చాడు.

రాత్రి భోజనం చేశాక మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి.ఉదయాన్నే మళ్లీ అదే ఆహారాన్ని వేడిచేయకుండా తిన్నాడు.

ఇది తిన్న కొద్దిసేపటికే జెస్సీకి జ్వరం వచ్చింది.అతని గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
వైరల్ : తల్లిదండ్రుల ప్రేమకు మించి మరొక ప్రేమ లేదనడానికి ఇదే ఉదహరణ కాబోలు..

జేసీని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతని శరీరం ఊదా రంగులోకి మారిపోయింది.వైద్యులను బాధితుడిని పరీక్షించగా.

Advertisement

అతడికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకిందని, ఫలితంగా సెప్సిస్ అనే వ్యాధి అతనికి సోకిందని తేలింది.ఈ వ్యాధి కారణంగా జేసీ కిడ్నీలు పనిచేయడం మానేశాయి.

దీనితో శరీరంలోకి రక్తం చేరడం మొదలైంది.అతని శరీరంలో ఇన్ఫెక్షన్ అత్యంత వేగంగా వ్యాపించడం మొదలయ్యింది.

ఈ కారణంగా వైద్యులు అతని ప్రాణాలను కాపాడుందుకు అతని రెండు కాళ్ళను తీసివేయాల్సి వచ్చింది.ఇన్‌ఫెక్షన్‌ పెరగడం చూసిన వైద్యులు అతడి చేతుల వేళ్లను కూడా తొలగించారు.26 రోజులుగా ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో పడివున్నాడు.ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం తినడం వలనే జెస్సీ అనారోగ్యం పాలయ్యాడని వైద్యులు తెలిపారు.

ఎలాంటి ఆహారపదార్థమైనా కాసేపు ఫ్రిజ్ లో పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.ఆహారాన్ని ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది కాదనివారు చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో నుంచి ఆహారాన్ని బయటకు తీశాక వేడి చేసిన అనంతరమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు