పోలీసులకు షాకిచ్చిన విద్యార్థిని.. అసలు నిజం ఇదేనటా..?

నేటి కాలం అమ్మాయిల్లో చాలమంది హద్దులు దాటి ప్రవర్తిస్తుండటం తరచుగా చూస్తునే ఉన్నాం.అదీగాక చట్టాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఇలాగే ఘట్‌కేసర్‌లో ఒక విద్యార్ధిని పొరపాటు చేసి చివరికి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే మరొక విద్యార్ధిని హోం వర్క్ నుంచి తప్పించుకోవడానికి తనపై అత్యాచారం జరిగిందని చెప్పి పోలీసులకు షాకిచ్చింది.ఇది నిజం అని నమ్మిన వారు ఆమెకు వైద్య పరీక్షలు చేపించడంతో అసలు నిజం బయటపడింది.

Student Kidnapped Drama Play Shocked By Police, Karnataka, Nandolli, Student, Ki

ఆ వివరాలు చూస్తే.కర్ణాటకలో నందొళ్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని గత బుధవారం పాఠశాలకు వెళ్లి కనబడకుండా పోయిందట.

దీంతో ఆ కుంటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న వారు ఆ బాలికను వెతికే పనిలో పడ్డారట.ఈ క్రమంలో గ్రామ సమీపంలోని అడవిలో పోలీసుల కంటపడ్ద ఆ బాలిక తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకొచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని ఆ బాలిక చెప్పిందిట.

Advertisement

ఇది నిజమని నమ్మిన పోలీసులు వెంటనే బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారట.కానీ ఆక్కడ ఇదంతా అబద్ధమని తేలడంతో ఖంగుతిన్న పోలీసులు వారి స్టైల్లో ప్రశ్నించే సరికి హోం వర్క్ చేయలేదని, దాని నుంచి తప్పించుకునేందుకే ఇలా చేసినట్లు తెలిపిందట.

చూశారా ఒక తప్పునుండి బయటపడటానికి ఆడే అబద్ధాలు చివరికి ప్రాణాల మీదికి తెస్తాయని గ్రహిస్తే మంచిదని అనుకుంటున్నారట.

Advertisement

తాజా వార్తలు