గల్ఫ్ నుండి నేరుగా ఆసుపత్రికి వెళ్లినా దక్కని ప్రాణం

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అన్నవేని స్వామి (32) ఉపాది నిమిత్తం దుబాయ్ వెళ్ళాడు.

అక్కడ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

గత కొంత కాలంగా అనారోగ్యం బారిన పడడంతో దుబాయ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆరోగ్యం కుదుట పడక పోవడంతో గత రెండు రోజుల క్రితం దుబాయ్ నుండి నేరుగా కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు.పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

చికిత్స పొందుతూ బుధవారం మరణించడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు.మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

ఉఫాది నిమిత్తం దుబాయ్ వెళ్లి విగత జీవిగా ఇంటికి తిరిగి రావడంతో అతని భార్య పిల్లలు రోదిస్తూన్న తీరు అందరి హృదయాలను కలిచివేసింది.మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్థులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement
మరుపురాని మహమనిషి ఎన్టీఆర్ - మోతె రాజిరెడ్డి

Latest Rajanna Sircilla News