మీ నెంబర్ పై కరోనా కాలర్ ట్యూన్ ‌ను డీయాక్టివేట్ చేయాలా...? ఇక ఎందుకు ఆలస్యం ఇలా ఫాలో అయిపోండి...!

ఒకప్పుడు మన మొబైల్ ఫోన్ లో మనకు నచ్చిన కాలర్ ట్యూన్ పెట్టుకునే వాళ్లం.

కానీ, ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి పుణ్యమా అని మన ఫోన్ కాలర్ ట్యూన్ కూడా మారిపోయింది.

ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసిన సరే క.రోనా.రింగ్ టోన్ వస్తుంది.

ఇది కూడా మన మంచికే అనుకుంటమే ఎందుకు అంటారా.? కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ప్రతి ఒక్కరూ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌ లను వాడుతున్నారు.అలాగే సామజిక దూరం పాటిస్తున్నారు.

అయితే కొందరు అవగాహన లేకనో, నిర్లక్ష్యం వల్లనోగాని ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు.అలాంటి వారికి కూడా అవగాహన కల్పించడం కోసం మన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని మొబైల్ వినియోగదారుల ఫోన్లకు ఈ కరోనా కాలర్ ట్యూన్ ‌ను సెట్ చేయించింది.

Advertisement

అన్ని టెలికాం సంస్థలన్నీ కలిసి మూకుమ్మడిగా ఈ సర్వీస్‌ ను అందిస్తున్నాయి.ఈ క్రమంలో మొబైల్ వినియోగదారులు ఇతరులకు కాల్ చేస్తే కరోనా కాలర్ ట్యూన్‌ వినిపిస్తుంది.

ముందుగా దగ్గు సౌండ్ వినిపించి తరువాత చేతులను సబ్బుతో కడుక్కోవాలని చెబుతారు.అలాగే కోవిడ్ జాగ్రత్తలను, ఇతర వివరాలను తెలియజేస్తారు.

మొత్తం 30 సెకన్ల పాటు ఆ కాలర్ ట్యూన్ వినిపిస్తుంది.అయితే కొందరికి ఈ ట్యూన్ విని విని విసుగు వచ్చేసింది.

అందుకే అలాంటి వారికి ఈ ట్యూన్‌ను డీయాక్టివేట్ చేయాలంటే వారు ఈ క్రింది విధముగా చేస్తే ఆ ట్యూన్‌ను డీయాక్టివేట్ లేదా వినిపించకుండా చేయవచ్చు.ఒక్కొక్క నెట్ వర్క్ వినియోగదారులు ఒక్కొక్క పద్దతిలో డీయాక్టివేట్ చేసుకోవాలి.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?

ఇక ఎయిర్‌టెల్ వినియోగదారులు అయితే *646*224# అనే నంబర్‌ను ప్రెస్ చేసి అనంతరం 1 నొక్కితే కరోనా కాలర్ ట్యూన్ డీయాక్టివేట్ అవుతుంది.అలాగే జియో నెటవర్క్ వాడే కస్టమర్లు STOP అని టైప్ చేసి 155223 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలి.

Advertisement

దీంతో కొరోనా కాలర్ ట్యూన్ డీయాక్టివేట్ అవుతుంది.అలాగే BSNL వినియోగదారులు అయితే UNSUB అని టైప్ చేసి 56700 లేదా 56799 అనే నంబర్లకు ఎస్ఎంఎస్ పంపాలి.

ఐడియా కస్టమర్లు అయితే STOP అని టైప్ చేసి 155223 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలి.లేదా కాల్ చేయవచ్చు.

వొడాఫోన్ కస్టమర్లు అయితే CANCT అని టైప్ చేసి 144 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలి.దీంతో కరోనా కాలర్ ట్యూన్ ను డీయాక్టివేట్ చేయవచ్చు.

తాజా వార్తలు