గుండమ్మ కథ కాకుండా బాలకృష్ణ, నాగార్జున కాంబోలో ఆగిపోయిన మూవీ ఏదో తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

పలు సందర్భాల్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.

బాలకృష్ణ, నాగార్జున కలిసి నటిస్తే బాగుంటుందని అటు నందమూరి అభిమానులతో పాటు ఇటు అక్కినేని అభిమానులు కూడా భావిస్తున్నారు.అయితే ఈ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

అటు బాలకృష్ణ ఇటు నాగార్జున మధ్య వృత్తిపరమైన పోటీ ఎక్కువగానే ఉంది.బాక్సాఫీస్ వద్ద పలు సందర్భాల్లో బాలయ్య, నాగ్ సినిమాలు పోటీ పడగా కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ పైచేయి సాధిస్తే మరికొన్ని సందర్భాల్లో నాగ్ పైచేయి సాధించారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ వారసులు అయిన బాలయ్య, నాగార్జున భవిష్యత్తులో కూడా కలిసి నటించే అవకాశాలు అయితే తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు.బాలకృష్ణకు అక్కినేని నాగేశ్వరరావు అన్నా ఆయన కుటుంబ సభ్యులు అన్నా ఎంతో గౌరవం ఉండేది.

Advertisement

బాలకృష్ణ ఏఎన్నార్ ను ప్రేమగా బాబాయ్ అని పిలిచేవారు.ఏఎన్నార్ తో కలిసి బాలయ్య కొన్ని సినిమాల్లో నటించారు.నాగార్జునకు కూడా నందమూరి ఫ్యామిలీ అంటే అభిమానం కాగా హరికృష్ణ, నాగార్జున కాంబినేషన్ లో సీతారామరాజు అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

మలయాళంలో హిట్టైన క్రిస్టియన్ బ్రదర్స్ సినిమా రీమేక్ లో బాలయ్య, నాగ్ ను నటింపజేయాలని ప్రయత్నాలు జరిగాయి.ఈ రీమేక్ లో నటించడానికి బాలయ్య, నాగ్ ఓకే చెప్పారు.వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు.

నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ ప్రాజెక్ట్ ను ఎలాగైనా నిర్మించాలని భావించినా ఆ తర్వాత రోజుల్లో బాలయ్య ఈ సినిమాకు నో చెప్పారు.ఈ సినిమా తెరకెక్కి ఉంటే బాగుండేదని బాలయ్య, నాగ్ అభిమానులు భావిస్తున్నారు.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు