ప్రముఖ నటి హేమ ఆస్తులు రూ.వందల కోట్లంటూ ప్రచారం.. అమె ఏమన్నారంటే?

సినిమాల ద్వారా హీరోహీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం కొన్ని సందర్భాల్లో కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలు అయితే ఉంటాయనే సంగతి తెలిసిందే.

చాలా సంవత్సరాల నుంచి సినిమాలలో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో నటించడం ద్వారా నటి హేమ ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ తన ఆస్తుల గురించి, ఇతర విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను చాలా సంవత్సరాల క్రితం దూరదర్శన్ లో సింగిల్ ఎపిసోడ్స్, టెలీ ఫిల్మ్స్ చేసేదానినని హేమ అన్నారు.

మీర్ సోదరుడు జాన్ తనకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడని రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నామని హేమ చెప్పుకొచ్చారు.తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి ముస్లిం కావడంతో రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు హేమ వెల్లడించారు.

అప్పుడు సంపాదన వేలల్లోనే ఉండేదని హేమ కామెంట్లు చేశారు.ప్రస్తుతం ఖర్చులు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయని హేమ వెల్లడించారు.

Advertisement

నేను ఇప్పటికి కూడా గంజి అన్నం తింటానని ఆమె చెప్పుకొచ్చారు.

గంజి అన్నంకు సూప్ రైస్ అని పేరు పెట్టుకున్నామని హేమ తెలిపారు.భగవంతుడు నాకు ఏ టెన్షన్స్ ఇవ్వలేదని ఆమె కామెంట్లు చేశారు.తన ఆస్తులు వందల కోట్లంటూ జరిగే ప్రచారంపై హేమ స్పందిస్తూ తన దగ్గర అంత డబ్బు ఉంటే దోసెల బండి దగ్గర దోసెలు ఎందుకు తింటానని అన్నారు.

తనకు ఆస్తులు బాగానే ఉన్నాయని అయితే మరీ వందల కోట్ల రూపాయల స్థాయిలో అయితే లేవని ఆమె అన్నారు.నా కూతురు స్థిరపడే స్థాయిలో అయితే సంపాదించానని ఏ పని అయినా వదలనని ఆమె తెలిపారు.తల దించుకునే పనులు చేయడానికి మాత్రం తాను అస్సలు ఇష్టపడనని ఆమె వెల్లడించారు.

మా అమ్మాయికి కుడా తాను ఇదే విషయాన్ని చెబుతానని హేమ చెప్పుకొచ్చారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు