తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి: తమ్మినేని

నల్లగొండ జిల్లా: ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి,మాజీ ఎంపీ తమ్మిన వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.గురువారం నల్లగొండ జిల్లా నకిరేకల్ లోని కడపర్తి రోడ్డు ఆవరణలో ఉన్న ఐకెపి కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో ఐకేపీ కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని, కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.అధికారులు నిర్లక్ష్యం కారణంగా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆందోళన చెందుతున్నారని,తడిసిన ధాన్యాన్ని,మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తార్పలిన్లు లేక ధాన్యం తడిసి ముద్దై మొలకెత్తుతున్నదని, ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని,అనేక కేంద్రాల్లో ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు గోనెసంచుల కొరత తీవ్రంగా కనిపిస్తున్నదన్నారు.

Advertisement

పది లారీలకు పంపాల్సిన గోనెసంచులను కేవలం ఒకట్రెండు లారీలకు మాత్రమే సరఫరా చేస్తున్నారని,కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలను అన్లోడ్ చేయడంలో రైస్ మిల్లర్ల దగ్గర జాప్యం జరుగుతున్నదన్నారు.ఏరోజుకారోజు కొనుగోలు చేయకపోవడంతో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్నదన్నారు.

దీంతో నెలల పాటు రైతులు పడిగాపులు కాయాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.ధాన్యం తూకం వేయడానికి తేమను సాకుగా చూపుతున్నారని, తరుగు తీయడం,బిల్లుల్లో కోతలు పెట్టడం ద్వారా రైతులకు తీవ్ర నష్టం కలుగుతున్నదన్నారు.

మార్కెట్లలో ప్రత్యక్ష దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టంగా కనబడుతుందని తెలిపారు.కోతకొచ్చిన వివిధ రకాల పంటలు, తోటలు కూడా ఈ అకాల వర్షాలకు దెబ్బతినడంతో ఆ రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలు,రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయి అధికారుల్లో కదలిక లేక రైతులు మనోవ్యధకు గురవుతున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఐకేపీ కేంద్రాల్లో సరిపడా గోనెసంచులు, లారీలు,పట్టాలను సరఫరా చేయాలని,కనీస సౌకర్యాలను కల్పించాలని,నష్టపోయిన అన్ని పంటల వివరాలను సేకరించి నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని బలి చేశారు.. రోజా షాకింగ్ కామెంట్స్!
Advertisement

Latest Nalgonda News