ఆ విషయంలో హీరోలను డామినేట్ చేస్తున్న శ్రీలీల.. హీరోల పరువు పోతుందంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో శ్రీలీల( Sreeleela ) ఒకరు కాగా శ్రీలీల రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

శ్రీలీల చేతినిండా పది ప్రాజెక్ట్ లు ఉండగా సినిమా సినిమాకు శ్రీలీల రేంజ్ పెరుగుతోంది.

సీనియర్ హీరోల ప్రాజెక్ట్ లలో, యంగ్ హీరోల ప్రాజెక్ట్ లలో వరుసగా ఛాన్స్ లు కొట్టేస్తున్న ఈ బ్యూటీని తమ సినిమాలలో తీసుకోవడానికి కొంతమంది స్టార్ హీరోలు భయపడుతున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ డ్యాన్సర్లలో రామ్ ఒకరు.

రామ్ డ్యాన్స్( Ram Pothineni ) ల కోసమే సినిమాలను చూసే అభిమానులు సైతం ఉన్నారు.అయితే స్కంద సినిమా నుంచి సాంగ్స్ విడుదలవుతుండగా ఈ సినిమాలోని సాంగ్స్ లో శ్రీలీల రామ్ ను అవలీలగా డామినేట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

శ్రీలీలను తమ సినిమాల్లోకి తీసుకోవాలంటే సరిగ్గా డ్యాన్స్ రాని హీరోలు భయపడాల్సిన పరిస్థితి ఉంది.

Sreeleela Dominating Heroines In Dance Matter Details Here Goes Viral In Social
Advertisement
Sreeleela Dominating Heroines In Dance Matter Details Here Goes Viral In Social

డ్యాన్స్ వచ్చిన హీరోలు సైతం తమకంటే శ్రీలీలకే ఎక్కువ మార్కులు పడతాయేమో అని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.శ్రీలీలకు తన టాలెంట్ ఒక విధంగా వరమైతే మరో విధంగా శాపమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శ్రీలీల రేంజ్, క్రేజ్ వేరే లెవెల్ అని అయితే వరుస విజయాలు సాధించాల్సి ఉందని కొంతమంది సోషల్ మీడియా( Social media )లో కామెంట్లు చేస్తున్నారు.

Sreeleela Dominating Heroines In Dance Matter Details Here Goes Viral In Social

శ్రీలీల ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రశంసలను అందుకుంటున్నారు.శ్రీలీల త్వరలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.అభినయ ప్రధాన పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ కు సైతం శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.

అయితే గ్లామర్ షో విషయంలో విమర్శలు రాకుండా శ్రీలీల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇతర భాషల్లో సైతం శ్రీలీలను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు