ఆ పాత్ర ఎంతో నీచం.. నాకే ఛీ అనిపించింది.. నటుడు కామెంట్స్ వైరల్?

డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో డా.

మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 1997.

ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.జీవిత కథ ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన సినిమా ఇది.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ మోషన్ పోస్టర్ విడుదల అయిన విషయం తెలిసిందే.అంతే కాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సాంగ్ కు అలాగే పాటకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది.ఇందులో ఆ శ్రీకాంత్ అయ్యంగార్ ఒక అవినీతి పోలీస్ అధికారిగా భిన్న పాత్రలో నటించారు.ఇక శ్రీకాంత్ అయ్యంగార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు విషయాల గురించి ముచ్చటించారు.

నా 47 ఏళ్లకు నాకు బ్రేక్ వచ్చింది.ముఖ్యంగా బ్రోచేవారెవరురా సినిమాతో నాకు మంచి సక్సెస్ దక్కింది.

Advertisement

అప్పటినుంచి సినిమాల్లో భిన్నమైన పాత్రలో చేస్తున్నానని చెప్పుకొచ్చారు శ్రీకాంత్.

ఒకసారి నేను షూటింగ్ చేస్తున్న సమయంలో మోహన్ గారు తెరపైకి వచ్చి కథ చెప్పారు.కథ నచ్చడంతో ఓకే చెప్పాను.అమ్మాయిపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన వంటి నేరాల నేపథ్యంలో 1997 సినిమా ఉండబోతోందని తెలిపారు.

ఇక నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతున్నప్పుడు నాకే ఛీ అనిపించింది.అంత నీచమైన పాత్ర నాది.నా గాడ్ ఫాదర్ వర్మ గారే.

ఒక నటుడిగా చైల్డ్ ఆర్టిస్ట్, హీరోయిన్, హీరో ఈ మూడు పాత్రలు తప్ప మిగిలిన పాత్రలు చేస్తాను అని తెలిపారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు