పవన్‌ కళ్యాణ్‌ సమాజానికి ప్రమాదం

పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీని ప్రారంభించిన సమయంలో ఆయన పక్కన ఉన్న ఒక వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు.ఆయనే శ్రీరాజు రవితేజ.

ఈయన గురించి అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది.ఒక సామాన్య వ్యక్తి నుండి ప్రపంచ ప్రసిద్ది గాంచిన వక్తగా ఈయన పేరు దక్కించుకున్నాడు.

కొన్ని పదుల దేశాల్లో శ్రీరాజు రవితేజ స్పీచ్‌లు ఇచ్చాడు.ఎంతో మందికి ఇన్సిపిరేషన్‌గా నిలిచాడు.

అలాంటి వ్యక్తి జనసేనలో ఉండటం చాలా గొప్ప విషయం అంటూ ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.జనసేన పార్టీ సిద్దాంతాల రూపకల్పనలో ఈయన చాలా కీలక భూమిక పోషించాడు.

Advertisement

అలాంటి శ్రీరాజు రవితేజ పార్టీని వదిలేసి గతంలో వెళ్లి పోయాడు.కాని మళ్లీ ఆయన పార్టీలో జాయిన్‌ అయ్యాడు.

పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఉన్న శ్రీరాజు రవితేజ మళ్లీ పార్టీకి గుడ్‌ బై చెప్పాడు.పార్టీకి రాజీనామా చేసిన ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సెన్షేషన్‌ అవుతున్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ వంటి వారు సమాజానికి ప్రమాదం అని, ఒక వర్గం వారికి మరో వర్గం వారికి వైరం కల్పించడంతో పాటు సమాజంలో జనాల మద్య విషబీజాలు నాటుతున్నాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.పవన్‌ లాంటి వ్యక్తులు అధికారం చేపట్టకుండా ఉండేలా చూడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చాడు.

ఆయన అధికారంలోకి వస్తే ప్రతీకారణ దోరణితో వ్యవహరిస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.రవితేజ ఈ వ్యాఖ్యలు చేయడంతో జనసేన పార్టీ నాయకులు పలవురు ఆలోచనల్లో పడ్డట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు