దారుణం : వందల ఏళ్ల చరిత్ర ఉన్న గుడి మూసివేత, ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

ఈ సమస్త లోకాలను కాపాడే వాడు ఆ దేవుడు అని అనుకుంటాం.

మతం ఏది అయినా కూడా దేవుడు ఒక్కడే, ఆయనే ఈ ప్రపంచాన్ని ముందుకు నడుపుతున్నాడని భావిస్తాం.

కాని కొన్ని సార్లు ఆ దేవుడికి కూడా పకృతి విలయ తాండవం చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుంది.దేవాలయాలు పకృతి వైపరిత్యాల వల్ల అప్పుడప్పుడు మూసేయాల్సి వస్తుంది.

కాని ఎక్కువ సార్లు అధిక వర్షాలు వచ్చినప్పుడు లేదంటే ఇతర కారణాల వల్ల దేవాలయాలు మూత బడ్డది మనం చూశాం.కాని నీటి ఎద్దడి కారణంగా గుడులు మూత బడటం మనం ఇప్పటి వరకు ఎప్పుడు చూసి ఉండం.

అది కూడా వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక గుడి అయ్యో, ఒక్క గుడి ఏంటి వందలాది గుడులు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి.ఈ పరిస్థితి మరెక్కడో కాదు, మన పక్క రాష్ట్రం అయిన కర్ణాటకలో నెలకొంది.

Advertisement

కర్ణాటకలో కరువు తాండవిస్తోంది.రాష్ట్రంలోని సగానికి పైగా ఎక్కువ జిల్లాల్లో కరువు విలయ తాంఢవం చేస్తోంది.

ఇంతటి దారుణమైన పరిస్థితులు అక్కడ గత వందల ఏళ్లలో ఎప్పుడు చూడలేదని ప్రభుత్వ వర్గాల వారు మరియు ప్రజలు చెబుతున్నారు.ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టే సంఘటన ఇది.వివరాల్లోకి వెళ్తే.దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన దేవాలయాల్లో శ్రీ మంజునాథేశ్వర ఆలయం.

ఇప్పుడు ఈ ఆలయంను మూసి వేసే పరిస్థితికి వచ్చింది.నేత్రావతి నదిలో నీరు లేని కారణంగా శ్రీ మంజునాథేశ్వర స్వామి ఆలయానికి నీటి యద్దడి విపరీతంగా ఉంది.

దైవ దర్శనం కోసం రోజు వేలాది మంది వస్తూ ఉంటారు.దాంతో అక్కడ నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

వచ్చే వారికి కనీసం మంచి నీరు కూడా అందించే పరిస్థితి లేదు.అందుకే గుడికి భక్తులను రావద్దంటూ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

ఇటీవల ఒక పేపర్‌ ప్రకటనలో వర్షాలు పడే వరకు దేవాలయంకు రావద్దంటూ దేవాలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.త్వరలోనే మళ్లీ మంచి రోజులు వస్తాయి, దేవుడు అందరిని చల్లగా కాపాడుతాడని ఆశిద్దాం అంటూ ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది.

మొత్తానికి కర్ణాటకలో ప్రస్తుతం కరువు పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో అక్కడ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది.వందల ఏళ్ల దేవాలయాలే మూత పడే పరిస్థితి ఉంటే అక్కడ సామాన్య జనాలకు మంచి నీటి పరిస్థితి ఎలానో మీరే అర్థం చేసుకోవచ్చు.

తాజా వార్తలు