ఆ ఒక్క ఆఫర్ తో శ్రీలీల దశ తిరిగినట్టేనా.. బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తారా? 

శ్రీలీల.( Sreeleela )ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

పెళ్లి సందడి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే మొన్నటి వరకు ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.

కానీ రాను రాను ఆమెకు అవకాశాలు తగ్గడంతో శ్రీ లీల జోరు తగ్గించేసింది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో శ్రీలీలకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.

అదేమిటంటే.

Advertisement

బాలీవుడ్ పై కన్నేసిందంట శ్రీలీల.ప్రస్తుతం ఒక సినిమాకు సైన్ చేసే ఆలోచనలో ఉందట.నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతోందట.

అది కూడా అలాంటి ఇలాంటి సినిమా కాదు.సైఫ్ అలీఖాన్ కొడుకు సినిమా.ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే.

సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్( Ibrahim Ali Khan ) సినిమాలో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వచ్చినట్టు తెలుస్తోంది.   కాగా అలీఖాన్ త్వరలోనే కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇందులో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారట.

వైఎస్సార్ కూడా టాలీవుడ్ హీరోలను అవమానించారు.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!
పవన్ కళ్యాణ్ ఇలా చేస్తే ప్రొడ్యూసర్స్ కి నష్టాలు తప్పవా..?

సౌత్ లో శ్రీలీల కెరీర్ ఏమంత సాఫీగా సాగడం లేదు.ఒకప్పుడు రోజుకు 15 గంటలు నాన్-స్టాప్ గా వర్క్ చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది.దీనికి కారణం వరుసగా వచ్చిన ఫ్లాప్స్.

Advertisement

భగవంత్ కేసరి మినహా ఆమె ఖాతాలో ఒక్క సక్సెస్ లేదు.తాజాగా వచ్చిన గుంటూరు కారం సినిమా, ఆమె కెరీర్ ను మరింత దెబ్బ తీసింది.

 ఇలాంటి సమయంలో బాలీవుడ్ ఆఫర్ రావడం, పైగా సైఫ్ అలీఖాన్ కొడుకు సినిమా కావడం నిజంగా లక్కీ అని చెప్పాలి.అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఏదీ రాలేదు.

తెలుగులో పవన్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తోంది శ్రీలీల.సాధారణంగా సౌత్ లో సూపర్ గా క్లిక్ అయిన హీరోయిన్లకు మాత్రమే, బాలీవుడ్ లో అవకాశాలు వస్తుంటాయి.

తాజా వార్తలు