Sr NTR: 35 ఏళ్ల వ‌య‌సులో కురు వృద్ధుడిగా నటించిన ఎన్టీఆర్ 

సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు.

ఆయన పోషించని పాత్ర లేదు.సినీ ఇండస్ట్రీలో అప్పట్లోనే ఆయన రికార్డులు సృష్టించారు.

ఏ పాత్ర చేసిన ఆ పాత్రలో జీవించేవారు.అద్భుతమైన నటనతో, డైలాగులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఒక పాత్ర మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.అంతేకాదు ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది.

Advertisement

ఇంతకీ ఆ సినిమా ఏంటి.ఆ పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం.ఎన్టీఆర్ చేసిన పాత్రల్లో కురు వృద్ధుడి పాత్ర( Old Man Role ) అందరిని షాక్ కి గురిచేసిందని చెప్పాలి.35 ఏళ్ళ వయసులో పాత్ర అంటే హీరోగానే చేస్తారు.

తండ్రిగా చేయడానికి కూడా కొందరు ఆలోచిస్తారు.కానీ ఎన్టీఆర్ 35 ఏళ్ళ వయస్సులో కురు వృద్ధుడి పాత్ర చేసి అదరగొట్టారు.ఎన్టీఆర్ ఏ పాత్ర వచ్చినా ఆ పాత్రని సవాలుగా తీసుకొని అద్భుతంగా నటించేవారు.

ఎన్టీఆర్ కెరీర్ లో గుర్తుండిపోయే సినీమాల్లో భీష్మ సినిమా( Bheeshma Movie ) ఒక‌టి.ఈ సినిమా విడుదల అయినప్పుడు ఎన్టీఆర్ వయస్సు 35 సంవత్సరాలు.ఈ సినిమా ఎక్కువ కలెక్షన్ సాదించనప్పటికీ మంచి విజయాన్ని, ఎన్టీఆర్ లో మరో కోణాన్ని చూపింది.

ఈ సినిమాకి దర్శక, నిర్మాత చక్రపాణి.( Director Chakrapani ) ఈ కథ ఎన్టీఆర్ చెప్పి ఆయనతో ఒప్పించి ఈ సినిమా తీశారు.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

ఈ సినిమాలో యువకుడిగా ఉన్న ఎన్టీఆర్ భీష్మ పాత్ర నుంచి కురువృద్ధుడు అయ్యే భీష్మ పాత్ర వ‌ర‌కు ఎన్టీఆర్ న‌టించారు.

Advertisement

ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా తీసినప్పుడు చాలా మందిని ఎన్టీఆర్ ముందే అడిగారట.నన్ను వృద్దుడిగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా? అని అడిగితే చాలా కష్టం అని చెప్పారట.కానీ సినిమాలో ఎన్టీఆర్ ని చూసిన అభిమానులు ఎన్టీఆర్ నటనకు( NTR Acting ) ఫిదా అయ్యారు.

అన్నగారిలో కొత్త కోణాన్ని చూశామని, అద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు.ఇలా ఏ పాత్ర వచ్చినా ఎన్టీఆర్ ఆ పాత్రని సవాలుగా తీసుకొని అందరితో శభాష్ అనిపించుకునేవారు.అయినా ఒక యువకుడు వృద్ధుడి పాత్ర చేయాలంటే చాలా ధైర్యం కావాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు