Jagan Dharmana Prasadarao : జగన్ పైనే చురకలు ..మరకలు !  సొంత పార్టీ నేతల తీరు ఇది ?

వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ వ్యవహార శైలి పై సొంత పార్టీ నాయకులు పరోక్షంగా సెటైర్ల ద్వారా తమ అసంతృప్తిని వెళ్ళగొక్కుతున్నారు.

పార్టీలో సీనియర్ నాయకులు, గతంలో అనేక రాజకీయ పార్టీల్లో కీలకంగా వ్యవహరించిన తమకు వైసీపీలో ఆ స్థాయిలో స్వతంత్రం, ప్రాధాన్యం లభించడం లేదని , ఎవరిని ఎదగనీయకుండా పార్టీలో వాయిస్ లేకుండా జగన్ చేసేస్తున్నారనే  అసంతృప్తి చాలామంది నాయకుల్లో ఉంది.

అయితే ఆ అసంతృప్తిని బయటకు వెళ్ళ గక్కితే ఆ తరువాత తమకు ఎదురయ్యే తలనొప్పులు ఇన్ని అన్ని కాదని , అందుకే సైలెంట్ గా ఉండడమే బెటర్ అన్న అభిప్రాయంతో చాలామంది నేతలు ఉన్నారు.సందర్భం వచ్చినప్పుడు తన అసంతృప్తిని ప్రజల అభిప్రాయంగా చెబుతూ వార్తల్లో ఉంటున్నారు.

 వైసీపీ సీనియర్ నేత,  శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు.శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా జగన్ పై ప్రజల్లో తీవ్ర  నిజమేనని,  అయితే అదంతా జగన్ చేపట్టిన సంస్కరణలు కారణంగానే అంటూ క్లారిటీ ఇచ్చారు .సంస్కరణలు అమలు చేసే వారికి ప్రజా వ్యతిరేకత తప్పనిసరి అంటూ ధర్మాన చెప్పుకొచ్చారు.మొదట్లో ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందని, సంస్కరణల ఫలితాలు ప్రజలకు అర్థం కావడానికి సమయం పడుతుందని,  ప్రజా వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా జగన్ సంస్కరణలు అమలు చేస్తున్నారని ధర్మాన చెబుతున్నారు. 

అయితే వైసిపి నాయకులు ఎవరు ధర్మాన స్థాయిలో మాట్లాడలేదు.అసలు జగన్ పాలనలో ప్రజల్లో అసంతృప్తి , వ్యతిరేకత లేదని చెబుతూ ఉంటారు కానీ ధర్మాన వ్యాఖ్యలు మాత్రం దానికి విరుద్ధంగానే ఉన్నాయి పరోక్షంగా జగన్ పై సెటైర్లు వేసే విధంగా ధర్మాన వ్యాఖ్యానిస్తున్నట్లుగా అనుమానాలు లేకపోలేదు.చాలా కాలంగా సీనియర్ నేతలు చాలామంది జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నా, ఆయన మాత్రం మౌనంగానే ఉంటున్నారు.

Advertisement
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

తాజా వార్తలు