ఎన్నారైలకి ప్రత్యేక గుర్తింపు కార్డులు...!!!

ఎన్నారైల సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని తెలిపిన భారత ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తుందని.

ప్రభుత్వ ఫలాలు అందని ఎన్నారైలకి ప్రత్యేక మైన గుర్తింపు కార్డు ద్వారా అందేలా చేస్తామని భారత విదేశాంగ శాఖామంత్రి మురళీధరన్ తెలిపారు.

నైజీరియా నుంచీ భారత్ కి వస్తూ దుబాయ్ లో దిగిన మంత్రిని ఎన్నారైలు కలిసి తమ గోడు వినిపించారు.

తాము పండుగల సమయంలో స్వదేశానికి వెళ్తామనే కారణంగా కొన్ని విమానయాన సంస్థలు అదే సమయంలో టిక్కెట్ చార్జీలు అమాంతంగా పెంచేస్తున్నాయని, దీనిపై దృష్టి సారిస్తే ఎన్నారైలకి ఆర్ధిక భారం తగ్గుతుందని విన్నవించారు.ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన మంత్రి , సివిల్ ఏవియేషన్ శాఖను ఇప్పటికే సంప్రదించామని, దీనిపై తగు చర్యలు తీసుకొనేలా వారిని ఒప్పించామని తెలిపారు.ఆధార కార్డు లేని ఎన్నారైలు చాలా వరకూ ప్రభుత్వ సేవలని ఉపయోగించుకోలేక పోతున్నామని చెప్పగా అలాంటి వారికోసం ప్రతీ ఎన్నారైకి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించామని, ఇమ్మిగ్రేషన్ బిల్లు లో కూడా మార్పులు చేస్తున్నామని ఆయన అన్నారు.

వచ్చే సమావేశాల్లో ఈ బుల్లు ని ప్రవేశపెడుతామని హామీ ఇచ్చారు.

Advertisement
ఫ్లైట్ పైనుంచి కిందపడ్డ పెద్ద మంచు ముద్ద.. దేనిపై పడిందో తెలిస్తే..?

తాజా వార్తలు