ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( S.P.Balasubrahmanyam )1966 నుంచి పాటలు పాడటం స్టార్ట్ చేశారు.ఆ సమయం నుంచి ఎంతోమంది దిగ్గజ సింగర్స్‌తో పాటలు పాడుతూ అలరించారు.ఆయన గాన కోకిల జానకితో కూడా కలిసి చాలా పాటలు ఆలపించారు.అయితే ఒక పాట పాడే సమయంలో తాను చేసిన ఒక పొరపాటు వల్ల జానకి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిందని ఎస్‌పీబీ తాను బతికున్నప్పుడు ఒక పాటల వేదిక సందర్భంగా తెలిపారు.తాను చేసిన ఆ పొరపాటు వల్ల జానకి ( Singer janaki )గారు బతకరేమోనని, తాను జైలు పాలు అవుతానేమోనని కూడా అప్పుడు భయపడినట్లు చెప్పుకొచ్చారు.
షాకింగ్ సంఘటన గురించి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.“సంపంగి పూల మాల తెచ్చి అందరికీ వేశారు.జానకి గారికి కూడా వేశారు.నిజానికి సంపంగి పూలు ఆమెకు అలర్జీ.దానివల్ల ఆమెకు విపరీతమైన బ్రీత్ లెస్నెస్ అంటే ఊపిరి ఆడక పోవడం జరిగింది.జానకి భర్త రాము( Ramu ) ఎప్పుడూ ఆమెతోనే ఉంటారు కానీ ఇది జరిగిన సందర్భంలో ఆయన ఎక్కడికో బయటికి వెళ్లారు.దాంతో నేను నాకేదో తెలిసిన ఒక మెడిసిన్ తెప్పించి ఇప్పించాను.కొద్ది నిమిషాల్లోనే ఆమెకు ఊపిరి సమస్య( Breathing problem ) తగ్గడానికి బదులుగా మొఖం వాచిపోయి, కళ్ళు ఎర్రబడి ఊపిరి అసలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
“దాంతో రికార్డ్ ఆపేయమని అందరికీ చెబుదాం అనుకున్నాను.కానీ వెళ్ళద్దు ముహూర్తం రోజు ఆపడం ఎందుకు? మనం పని కాని చేద్దామని, జానకి నాకు సర్ది చెప్పి అలానే పాడేశారు.నిజానికి ఆమె రెండు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకున్నంతగా చాలాసేపు కంటిన్యూగా పాడగలరు.నాకు చాలా భయమేసింది.
చేతికి సంకెళ్లు వేసి నన్ను జైలుకు తీసుకుపోతారు అనే ఆలోచనలు కూడా మెదడులో మెదిలాయి.” అని చెప్పుకొచ్చారు.ఎస్పీబీ చేసిన ఈ కామెంట్స్‌కి సంబంధించిన క్లిప్పు ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social media ) వైరల్ గా మారింది.ఇది చూసి చాలామంది షాక్ అవుతారు.
అదృష్టం కొద్దీ జానకీ ఆ గండం నుంచి ఎలాగోలా బయటపడి మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను అలరించారని కామెంట్స్ చేస్తున్నారు.