రాబోవు ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ స్థానం( Mulugu ) చాలా ఆసక్తికరంగా మారబోతోంది.కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (Seethakka) అక్కడ బలమైన నేతగా ఉన్నారు.
ఎప్పుడు ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్లే సీతక్కను టార్గెట్ చేస్తూ బిఆర్ఎస్ (BRS) పావులు కలుపుతోంది.ఈ క్రమంలోనే ఆమెపై పోటీ చేసి గెలుపొందే విధంగా ఒక అభ్యర్థిని ప్రకటించాలని భావించింది.
ఆమెకు ధీటైన లీడర్ బడే నాగజ్యోతి (Bade Nagajyothi) ని ములుగు నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది.ఈ తరుణంలోనే ములుగు నియోజకవర్గం వ్యాప్తంగా రాజకీయ చదరంగం మొదలైందని చెప్పవచ్చు.
మరి సీతక్క తాకిడిని నాగజ్యోతి తట్టుకోగలదా.అసలు ములుగు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సీతక్క అలియాస్ అనసూయ పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసి ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చింది.గతంలో టిడిపి (TDP) పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించింది.ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి మరోసారి విజయం సాధించింది.2009లో టిడిపి అభ్యర్థిగా గెలిచింది.మళ్లీ 2014లో ఓడిపోయింది.2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించింది.ఇక రేవంత్ రెడ్డి (Revanth reddy) టీపీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత రేవంత్ నమ్మిన బంటుగా ఉంటూ సీతక్క ముందుకు వెళుతోంది.అంతేకాకుండా కరోనా సమయంలో ములుగు జిల్లాకు సంబంధించిన అడవుల్లో తిరుగుతూ ఎంతోమంది గిరిజనులకు బాసటగా నిలుస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంతేకాదు ములుగు ప్రజల గుండెల్లో సీతక్క గూడుకట్టుకుంది అని చెప్పవచ్చు.ఆమె గెలుపు అనేది పార్టీలకు అతీతంగా ఉంటుంది.

ఆమె ఏ పార్టీ నుంచి పోటీ చేయకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమెకు ప్రజల్లో ఉండే బలం మరో లెవల్.అలాంటి సీతక్కపై ఈసారి పోటీలో ఉండేందుకు ములుగు (Mulugu) జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతిని బరిలోకి దింపింది బిఆర్ఎస్.నాగజ్యోతి తల్లిదండ్రులు కూడా నక్సల్స్ ఉద్యమ పార్టీలో పని చేశారు.అందులోనే ప్రాణాలు విడిచారు.అలాంటి త్యాగశీలుల బిడ్డనే బడే నాగజ్యోతి.ఈమె కూడా ఎప్పుడూ ప్రజలే దైవంగా భావిస్తూ ప్రజాసేవ చేస్తూ ముందుకు వెళుతుంది.
కానీ సీతక్క రాజకీయ జీవితం ముందు చాలా చిన్నది.అయినా సీతక్కని ఎదుర్కొనేందుకు కెసిఆర్ (KCR) అభయహస్తంతో ముందుకు వస్తోంది.
మరి ఇద్దరు బడా నేతల పోటీలో ప్రజల మన్ననలు ఎవరి వైపు ఉంటాయో ముందు ముందు తెలుస్తుంది.