Sonia Agarwal Selvaraghavan : మాజీ భర్తతో పని చేయడం నాకు ఇష్టమే.. సోనియా అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

హీరోయిన్ సోనియా అగర్వాల్‌( Sonia Agarwal ) గురించి మనందరికి తెలిసిందే.

సోనియా అగర్వాల్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా 7/జీ బృందావనం కాలనీ.

( 7/G Brindavan Colony ) ఈ సినిమాతో భారీగా పాపులరీటిని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.అయితే ఈ సినిమా కంటే ముందు తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఈ మూవీతో భారీగా పాపులరీటిని సంపాదించుకుంది.

ధనుష్‌ సరసన కాదల్‌ కొండేన్‌, పుదుపేటఐఅట, రవికృష్ణకు జంటగా 7/జీ బృందావన్‌ కాలనీ వంటి విజయవంతమైన చిత్రాల్లో కథానాయికిగా నటించారు.ఈ మూడు చిత్రాలకు దర్శకుడు సెల్వరాఘవనే( Director Selvaraghavan ) అన్న విషయం తెలిసిందే.

ఆ సమయంలో సెల్వరాఘవన్‌, నటి సోనియా అగర్వాల్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కానీ వీరి వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు.

Advertisement

విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు.ఆ తరువాత ఎవరి వృత్తిని వారు కొనసాగిస్తున్నారు.

అయితే ఆ తరువాత ఈ ఇద్దరిలో ఎవరికీ సరైన హిట్స్‌ లేకపోవడం గమనార్హం.కాగా ఇటీవల నటుడిగానూ అవతారం ఎత్తిన సెల్వరాఘవన్‌ తాజాగా ఆ వృత్తికి ఫుల్‌స్టాప్‌ పెట్టి మళ్లీ దర్శకత్వంపై దృష్టి పెట్టారు.

తను ఆదిలో తెరకెక్కించి సంచలన విజయాన్ని కొట్టిన 7/జీ బృందావన్‌ కాలనీ చిత్రానికి సీక్వెల్‌( 7/G Brindavan Colony Sequel ) తీయనున్నారు.ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది.కాగా ఆయన ఇంతకు ముందు దర్శకత్వం వహించిన మరో సూపర్‌ హిట్‌ పుదుపేట్టై( Pudhupettai ) చిత్రానికి సీక్వెల్‌ చేస్తానని ప్రకటించారు.

అదీ ఈ ఏడాదిలోనే మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.కాగా పుదుపేట్టై చిత్రంలో ధనుష్‌( Dhanush ) సరసన నటి సోనియా అగర్వాల్‌, స్నేహా నటించారు.దీంతో పుదుపేట్టై– 2 చిత్రంలో మీరు నటిస్తారా? అన్న ప్రశ్నకు నటి సోనియా అగర్వాల్‌ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

సెల్వరాఘవన్‌ తో కలిసి పని చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.నటన నా వృత్తి అని తెలిపింది సోనియా అగర్వాల్.పుదుపేట్టై 2( Pudhupettai-2 ) చిత్రంలో నటించడం తనకు ఇష్టమేనని అన్నారు.

Advertisement

అయితే ఆ చిత్రంలో నటించే విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు.అసలు ఆ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారో కూడా తెలియదని నటి సోనియా అగర్వాల్‌ పేర్కొన్నారు.

కాగా ఈ సందర్బంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

తాజా వార్తలు