Anushka Shetty: నాగార్జున కు ఆ హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడంతో టాలీవుడ్ కి ఒక స్టార్ హీరోయిన్ దొరికింది..!

ఒక్కోసారి సినిమాకి ఫైనల్ చేసిన హీరో హీరోయిన్స్ చివరగా మారిపోతూ ఉంటారు.

చివరి నిమిషంలో చేరిన మరికొంత మంది నటీనటులు ఓవర్ నైట్ స్టార్ యాక్టర్స్ గా నిలబడిపోతారు.

అలా సినిమాల్లో నటించడం అయితే చేస్తారు కానీ కొంతమంది ఎంతగానో ఎదురు చూసిన ఛాన్స్ తో ఫ్లాప్ కూడా అందుకునే అవకాశం ఉంటుంది.అలా పూరి జగన్నాథ్( Puri Jagannath ) ఒక సినిమా కోసం అనుకున్న హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడంతో మరొక హీరోయిన్ ని ల్యాండ్ చేశాడు దాంతో ఆమె టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అలా ఏ సినిమా కోసం జరిగిందో ? ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్( Heroine ) ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పూరి జగన్నాథ్ డైరెక్టర్గా నాగార్జున( Nagarjuna ) హీరోగా నటించిన సినిమా సూపర్( Super Movie ) ఈ సినిమా పరాజయం పాలైంది అయితే ఈ చిత్రంలో నటించిన అనుష్క( Anushka ) పాత్ర కోసం మొట్టమొదటగా వేరే హీరోయిన్ ని అనుకున్నారట.ఆమె చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో వేరే ఆప్షన్ లేక మళ్ళీ ముంబై నుంచి అనుష్కని తెప్పించారట.అలా ఇండస్ట్రీకి వచ్చిన అనుష్క ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

అయితే అనుష్క కన్నా ముందు ఆ పాత్ర కోసం అనుకున్న హీరోయిన్ మరెవరో కాదు.ఆమె సోనాలి బింద్రే.( Sonali Bendre ) అనుష్క పాత్రలో నటించడానికి సోనాలి చివరి నిమిషంలో నో చెప్పిందట.

దాంతో వేరే ఆప్షన్ లేక కొత్త హీరోయిన్ దింపాలని నాగార్జున సూచించడంతో పూరి జగన్నాథ్ అనుష్కని తీసుకొచ్చాడట.

అలా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క ఆ తర్వాత హీరోయిన్ గా మంచి అవకాశాలను దక్కించుకుంది.ప్రస్తుతం కెరియర్ చరమాంకం లో ఉన్న అనుష్క ఇప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంది.తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా( Miss Shetty Mr Polishetty ) సైతం విజయవంతం అయింది.

కానీ ఇంత లాక్ చూసారా సోనాలి బింద్రే వదిలేసుకున్న పాత్ర కోసం వచ్చిన అనుష్క ఇలా ఒకరోజు టాలీవుడ్ ను ఏలుతానని ఊహించి ఉంటుందా.మొత్తానికి ఏదో జరగాలంటే మరెన్నో జరుగుతుంది అదే విధి వైపరీత్యం అంటే.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు