ఎక్కడైనా ఏ పార్టీ నాయకుడైనా.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి, తాను ఉన్న ప్రాంతానికి తను జీవిస్తున్న రాష్ట్రానికి మేలు చేయాలని అనుకుంటారు.
కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారం దీనికి చాలా భిన్నంగా ఉందనే వాదన వినిపిస్తోంది.ఆయన తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌కు రాసిన లేఖ బీజేపీలోనే సంచలనంగా మారింది.వారు కూడా దీనిపై పెదవి విరుస్తున్నారు.“మా సోము ఇలా రాస్తాడని అనుకోలేదు“ అని రాష్ట్రానికి చెందిన నాయకుడు, కేంద్రంలో చక్రం తిప్పుతున్న కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారంటే.సోము రాసిన లేఖ ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ప్రస్తుతం తెలంగాణ-ఏపీల మధ్య జలవివాదం పొడసూపింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.దీనిపై మంగళవారం కేంద్రంలో పంచాయితీ జరగనుంది.
ఈ క్రమంలో సీఎం జగన్ డిల్లీ కూడా వెళ్లారు.సీమకు నీరు అందించే ప్రాజెక్టులను అడ్డుకోరాదని వ్యక్తిగతంగా కూడా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు విన్నవించారు.
అయితే, దీనికి సంబంధించి కేంద్రంలో బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ నేతగా సోము.ఏపీకి న్యాయం చేయాలని కోరవచ్చు.ఈ క్రమంలో ఆయన కేంద్రంపై ఒత్తిడి కూడా తెచ్చి దీనిని ఓటు బ్యాంకుగా కూడా వినియోగించుకునే అవకావం ఉంది.
కానీ, సోము దీనిని కుటిల రాజకీయాలకు వినియోగించుకున్నారు.ఏపీనే తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించాలని ఆయన విన్నవించారు.అంతేకాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన ఆరేళ్లలో అనేక ప్రాజెక్టులను కృష్నానదిపై నిర్మించారని, అప్పట్లో సీఎంగా చంద్రబాబు వీటిని అడ్డుకోలేదని, అప్పట్లోప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ కూడా చూసీ చూడనట్టు వ్యవహరించారని, కాబట్టి వారి గొడవేదో వారుపడతారు.మీరు మౌనం వహించాలని అన్నట్టుగా కేంద్రానికి లేఖ రాయడం.
ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది.
పైగా ఇది కర్నూలు, అనంతపురంలో ఏదో ఒక మాత్రంగా ఉన్న బీజేపీకి తీవ్ర ఇబ్బందికర పరిణామంగా తయారైందని అంటున్నారు కమలం పార్టీ నేతలు.
అయ్యా సోము.నువ్వు ఏలేఖలు రాయొద్దు! అనివారు వేడుకునే పరిస్థితి వచ్చింది.
మరి సోము వీర్రాజు ఇలా అయితే.రాష్ట్రంలో బీజేపీ ఎలా పుంజుకుంటుందో ఆయనే చెప్పాలి! అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తుండడం గమనార్హం.